వైల్డ్ డాగ్ షూటింగ్ వివరాలను తెలుపుతూ వీడియో షేర్ చేసిన కింగ్ నాగార్జున..!  

Hero Nagarjuna Shares a video of wild dog shooting at Himalayas, Hero Nagarjuna, Wild Dog Shooting, Himalayas, Manali,Bigg Boss4, 21 Days Shooting - Telugu 21 Days Shooting, Bigg Boss4, Hero Nagarjuna, Hero Nagarjuna Shares A Video Of Wild Dog Shooting At Himalayas, Himalayas, Manali, Wild Dog Shooting

టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున ప్రస్తుతం సినిమా షూటింగ్స్ లో బిజీబిజీగా గడిపేస్తున్నారు.ఒకవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు బుల్లితెరపై వారాంతంలో బిగ్ బాస్ షోకి హోస్టింగ్ చేస్తూ బిజీ బిజీ గడిపేస్తున్నారు.

TeluguStop.com - King Nagarjuna Shared A Video Detailing The Wild Dog Shooting

ఇక అసలు విషయంలోకి వెళితే ప్రస్తుతం అక్కినేని నాగార్జున వైల్డ్ డాగ్ చిత్రం లో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.ఈ సినిమాకు అహి షోర్ దర్శకత్వం వహిస్తున్నారు.

ప్రస్తుతం వైల్డ్ డాగ్ చిత్రానికి సంబంధించిన షూటింగ్ మనాలిలో జరుగుతుంది.ఇందుకోసం హీరో నాగార్జున తో పాటు చిత్ర బృందం సభ్యులు హిమాలయ ప్రాంతంలోని రోహ్‌తంగ్ పాస్ లో వైల్డ్ డాగ్ చిత్రీకరణ చేస్తోంది.

TeluguStop.com - వైల్డ్ డాగ్ షూటింగ్ వివరాలను తెలుపుతూ వీడియో షేర్ చేసిన కింగ్ నాగార్జున..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయితే షూటింగ్ చేస్తున్న ప్రదేశం నుండి తాజాగా అక్కినేని నాగార్జున ఆ ప్రాంతానికి సంబంధించి వివరాలను తెలుపుతూ సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు.ఇక ఆ వీడియోలో అక్కినేని నాగార్జున ఏమన్నారంటే…

హాయ్.

రోహ్‌తంగ్ పాస్ దగ్గర బ్యూటిఫుల్ మార్నింగ్. వైల్డ్ డాగ్ చిత్రీకరణ ఇక్కడ కొనసాగుతోంది.

సముద్ర మట్టానికి 3980 మీటర్ల ఎత్తులో అనగా 13వేల అడుగుల ఎత్తులో తాను ఉన్నట్లు చెప్పుకొచ్చాడు.అంతే కాకుండా అది చాలా డేంజరస్ ప్లేస్ అంటూ తెలిపాడు.

నవంబర్ నెల నుండి మే నెల వరకు ఈ మార్గాన్ని మూసి వేస్తారని.అయితే ప్రస్తుతం వైల్డ్ డాగ్ సినిమా షూటింగ్ కోసం తాను ఇక్కడికి వచ్చాను అంటూ తెలిపాడు.

ఇందులో భాగంగానే షూటింగ్ చాలా బాగా జరుగుతుందని వివరించాడు.అందమైన పర్వతాలు, వాటర్ ఫాల్స్, నీలి ఆకాశం ఇలా అన్ని ఏడు నెలల తర్వాత ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేస్ కు రావడం తనకు ఎంతో ఆనందంగా ఉందంటూ తెలిపాడు.

ఆ ప్రాంతంలో మొత్తం 21 రోజులు షూటింగ్ జరుగుతుందని ఆ తర్వాత తిరిగి వచ్చేస్తాను అంటూ లవ్ యు అల్ అని నాగార్జున తెలిపారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.

#Manali #Hero Nagarjuna #Bigg Boss4 #Himalayas #HeroNagarjuna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

King Nagarjuna Shared A Video Detailing The Wild Dog Shooting Related Telugu News,Photos/Pics,Images..