సీఎం జగన్‌ తో నాగార్జున భేటీ కారణం ఏంటో తెలియడం లేదే

టాలీవుడ్‌ స్టార్‌ హీరో నాగార్జున కొద్ది సేపటి క్రితం ఏపీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డితో భేటీ అయ్యాడు.మద్యాహ్నం సమయంలో నాగార్జున విజయవాడ విమానాశ్రయంలో దిగి అక్కడ నుండి తాడేపల్లి లోని సీఎం క్యాంప్‌ ఆఫీస్ కు వెళ్లడం జరిగింది.

 King Nagarjuna Meet With Ap Cm Ys Jagan Mohan Reddy,latest Tollywood News-TeluguStop.com

అక్కడ నాగార్జున కు జగన్‌ అపాయింట్ మెంట్‌ ఇవ్వడం జరిగింది.అక్కడ దాదాపుగా గంటపాటు జగన్ తో నాగార్జున మాట్లాడినట్లుగా తెలుస్తోంది.

ఈ సందర్బంగా టాలీవుడ్‌ కు చెందిన పలు విషయాల గురించి నాగార్జున మాట్లాడారు అంటూ వార్తలు వస్తున్నాయి.ముక్యంగా థియేటర్లు పూర్తి స్థాయిలో ఓపెన్ చేసినందుకు కృతజ్ఞతలు చెప్పడంతో పాటు టికెట్ల రేట్ల విషయంలో కూడా చర్చలు జరిపారు అంటూ సమాచారం అందుతోంది.

నాగార్జున మరియు జగన్ మోహన్ రెడ్డిల మద్య వచ్చిన చర్చ ఇంకా ఏమై ఉంటుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు మీడియా వర్గాల వారు చర్చించుకుంటున్నారు.

Telugu Bangarraju, Nagarjuna, Ys Jagan-Movie

నాగార్జున కొద్ది సేపటి తర్వాత అయినా జగన్ ను కలిసిన విషయం ఏంటీ.ఎందుకు హడావుడిగా జగన్ ను కలవడం జరిగింది అనే విషయమై మాట్లాడే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.ఇక నాగార్జున ప్రస్తుతం ఘోస్ట్‌ సినిమా ను చేస్తున్న విషయం తెల్సిందే.

ఆ సినిమా కు ప్రవీన్ సత్తార్‌ దర్శకత్వం వహించాడు.భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమా విడుదల చేసేది వచ్చే ఏడాది సమ్మర్ లో అంటూ వార్తలు వస్తున్నాయి.

ఇదే సమయంలో బంగార్రాజు సినిమా ను కూడా నాగార్జున చేయబోతున్నట్లుగా ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది.సినిమా చిత్రీకరణ ప్రారంభించి కొంత మేరకు షూటింగ్ కూడా పూర్తి చేశారు.

ఈ రెండు సినిమా లు కూడా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube