ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన మెగా హీరో వైష్ణవ్ తేజ్.ఈ కుర్ర హీరో మొదటి సినిమాతో ఏకంగా వంద కోట్ల క్లబ్ లో చేరిపోయాడు.
అయితే ఆ క్రెడిట్ హీరో కంటే ఉప్పెన సినిమాలో ఉన్న కంటెంట్ కి దక్కుతుంది.ఇదిలా ఇక వైష్ణవ్ తేజ్ రెండో సినిమా క్రిష్ దర్శకత్వంలో ఇప్పటికే తెరకెక్కింది.
ఈ సినిమా రిలీజ్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు.మొదటి సినిమా ఎఫెక్ట్ తో ఈ కుర్ర హీరోకి ఇప్పటికే పలువురు నిర్మాతలు అడ్వాన్స్ లు ఇచ్చేశారు.
ఇదిలా ఉంటే వైష్ణవ్ మూడో సినిమా అన్నపూర్ణ బ్యానర్ లో ఉంటుందని, నాగార్జున ఈ సినిమాని నిర్మిస్తాడని టాక్ నడిచింది.అయితే దీనిపై ఎవరి నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు.
దీంతో ఈ ప్రాజెక్ట్ ఉందా లేదా అనే డౌట్ అందరికి వచ్చింది.ఈ నేపధ్యంలో తాజాగా కింగ్ నాగార్జున వైష్ణవ్ తేజ్ మూవీ గురించి క్లారిటీ ఇచ్చాడు.
అన్నపూర్ణ బ్యానర్ లో వైష్ణవ్ తేజ్ మూవీ ఉంటుందని.ఇప్పటికే అతనికి కథ కూడా చెప్పడం జరిగిందని, వైష్ణవ్ కి కథ చాలా నచ్చిందని చెప్పుకొచ్చారు.
ఇక ఈ సినిమాతో ఓ టాలెంటెడ్ యంగ్ స్టార్ ని దర్శకుడుగా పరిచయం చేయబోతున్నట్లు తెలిపారు.త్వరలో ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని కూడా క్లారిటీ ఇచ్చారు.
వైల్డ్ డాగ్ సినిమా ప్రమోషన్ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకి సమాధానం ఇస్తూ వైష్ణవ్ తేజ్ మూవీ గురించి నాగార్జున విషయం బయట పెట్టాడు
.