బంగార్రాజు గురించి ఇంట్రెస్టింగ్‌ న్యూస్, అక్కినేని ఫ్యాన్స్‌ ఫుల్‌ హ్యాపీ

అక్కినేని నాగార్జున, కళ్యాణ్‌ కృష్ణల కాంబోలో గతంలో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.ఆ సినిమాలోని బంగార్రాజు పాత్ర చుట్టు కథను అల్లి సినిమాగా తెరకెక్కించేందుకు గత మూడు సంవత్సరాలుగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి.

 King Nagarjuna Bangaraju Latest Update-TeluguStop.com

ఎట్టకేలకు ఆ ప్రయత్నాలకు తుది రూపు వచ్చినట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.

Telugu Akkineni Fans, Nagachaitanya, Nagarjuna, Nagarjuna Fans-Movie

నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ కంటిన్యూ అవ్వబోతుంది.ఇక ఈ చిత్రంలో నాగచైతన్య కూడా కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం నాగచైతన్యకు జోడీగా ఒక స్టార్‌ హీరోయిన్‌ నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.ఈ సినిమాను త్వరలోనే షూటింగ్‌ ప్రారంభించాలని భావిస్తున్నారు.నాగార్జున స్వయంగా ఈ సినిమాను నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.

ప్రస్తుతం నాగార్జున వైల్డ్‌ డాగ్‌ అనే చిత్రంలో నటిస్తున్నాడు.

ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది.ప్రముఖ స్టార్స్‌ ఆ సినిమాలో నటిస్తున్న నేపథ్యంలో ఆ సినిమాపై కూడా నెటిజన్స్‌లో ఆసక్తి నెలకొంది.

ముఖ్యంగా బంగార్రాజు సినిమాకు మాత్రం అంచనాలు భారీగా ఉన్నాయి.మరో సోగ్గాడు రేంజ్‌లో ఈ సినిమా ఉంటుందని ఆశిస్తున్నారు.

మరి ఆ స్థాయిలో ఉంటుందా అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube