ఇదినిజం : తన తోక తొక్కినందుకు అతడిని రెండు కి.మీలు పరిగెత్తించిన పాము

పాములు పగ పడతాయని నూటికి 80 శాతం మంది నమ్ముతారు.ముఖ్యంగా మన ఇండియాలో ఈ విషయాన్ని చాలా ఎక్కువ మంది నమ్ముతారనే విషయం మీకు తెలుసా.

 King Cobra Chases Biker For 2 Kms For Reptiles Her Tail-TeluguStop.com

మన దేశంలో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా ఆ విషయాన్ని నమ్మాల్సి వచ్చింది.ముఖ్యంగా తాసు పాములు పగ పట్టి చంపే వరకు వదలవు అంటారు.

మనిషికి పాముకు ఉన్న విరోదం ఇప్పటిది కాదు కొన్ని వందలు వేల ఏళ్లుగా వస్తుందని, దాన్ని ఇప్పుడు కొత్తగా చూడాల్సిన అవసరం లేదు అంటూ పెద్దలు అంటూ ఉంటారు.

Telugu Guddu Pachowri, Cobra, Cobrachases, Snake Bike, India, Uttarpradesh-

పాములకు కోపం ఎక్కువే మరియు పగ పడతాయని చెప్పేందుకు మరో సాక్ష్యం ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.యూపీలో జరిగిన ఈ సంఘటన కాస్త విడ్డూరంగా ఉన్నా వెన్నులో ఒణుకు పుట్టించే విధంగా ఉంది.పూర్తి వివరాల్లోకి వెళ్తే.

ఉత్తర ప్రదేశ్‌కు చెందిన జలాన్‌ జిల్లాలో గుడ్డు పచౌరీ అనే వ్యక్తి ఇటీవల తన టూ వీలర్‌పై సాయంకాల సమయంలో ఒక చోటు నుండి మరో చోటుకు వెళ్తున్నాడు.నిర్మానుశ ప్రాంతంలో పచౌరీ ఏదో ఆలోచనలో వెళ్తున్న సమయంలో రోడ్డు దాటుతున్న పామును చూసుకోకుండా దాని తోకను తొక్కించాడు.

Telugu Guddu Pachowri, Cobra, Cobrachases, Snake Bike, India, Uttarpradesh-

ఒక్క క్షణం టెన్షన్‌ పడ్డా ముందుకు వెళ్లిన తర్వాత కాస్త కూల్‌ అయ్యాడు.ఎందుకో ఒకసారి వెనక్కు తిరిగి చూడగా ఆ పాము తన వెంట పడుతున్న విషయంను గుర్తించాడు.దాంతో బండి వేగంను పెంచాడు.బండిపై రెండు కిలోమీటర్లు వెళ్లిన తర్వాత కూడా ఇంకా ఆ పాము వెంట పడుతూనే ఉంది.దాంతో అతడు బండిని అక్కడ వదిలేసి పరుగు పెట్టాడు.పాము వచ్చి బండిపై కూర్చుని ఉంది.

అతడు తన బండి కోసం ఇద్దరు ముగ్గురును వెంట పెట్టుకుని వచ్చాడు.అప్పటికి ఆ పాము అక్కడే ఉంది.

దాంతో జనాలు ఆ పామును రాళ్లతో కొట్టి పొదల్లోకి వెళ్లేలా చేసి ఆ బండిని అక్కడ నుండి తీసుకు వెళ్లారు.అయితే అతడిపై పాము పగ పట్టిందని ఇప్పుడు కాకున్నా మరికొన్నాళ్లకైనా ఖచ్చితంగా అతడిని కాటు వేసే వరకు ఊరుకోదని, కొన్నాళ్లు ఊరికి దూరంగా వెళ్లడం మంచిదని ఆయన స్థానికులు చెబుతున్నారట.

మొత్తానికి పాము పగ పట్టడం మరోసారి నిరూపితం అయ్యిందంటూ జనాలు అనుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube