కిమ్ పాలక పార్టీ సమావేశం.. పలు అంశాలపై చర్చ

దేశం, ఇతర దేశాల్లోనూ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కీలక పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు.గత ఎనిమిది నెలల తర్వాత తొలిసారిగా ప్రజల ముందుకు వచ్చిన కిమ్ అత్యంత కీలక సమస్యల పరిష్కరించడానికి భేటీ అయ్యారు.

 North Koriya, Kims, Meeting-TeluguStop.com

కరోనా కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది.దీనికి తోడు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో వరద రూపంలో కొత్త సమస్య వచ్చి పడింది.

వరద కారణంగా పంటలు నాశనమయ్యాయి.

కేంద్ర కమిటీ సమావేశంపై ఉత్తర కొరియా అధికారిక మీడియా కేసీఎన్ఏ కొన్ని వాదనలు వినిపించింది.

దేశ అభివృద్ధి, పార్టీ పోరాట సామర్థ్యాన్ని పెంచడం వంటి విషయాలపై చర్చించినట్లు వెల్లడించింది.అయితే ఈ ఏడాది ప్రారంభంలోనే కిమ్ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఆయన తర్వాత ఎవరు అధ్యక్ష పదివిని చేపడుతారనే వార్తలు వినిపించాయి.

కాగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో అణునిరాయుధీకరణపై జరిగిన చర్చల వల్ల ఎటువంటి ఉపశమనం కనిపించలేదు.కరోనా కారణంగా ఒప్పందం నిలిచిపోవడంతో అమెరికా, ఉత్తర కొరియా ఉమ్మడి సైనిక విన్యాసాలు నిర్వహించాయి.

ఉత్తర కొరియా ఏర్పాటు చేసుకున్న పాలక పార్టీ సమావేశంపై అమెరికా ప్రభుత్వ మాజీ విశ్లేషకుడు రాచెల్ మిన్యాంగ్ లీ స్పందించాడు.వారసత్వం, విదేశాంగ విధానంలో ఉత్తర కొరియా చురుకుగా లేదని, కరోనా మహమ్మారి కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ, ప్రజల జీవన ప్రమాణాలు తీవ్ర ప్రభావం చూపిందన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube