అప్పుడు సగం.. ఇప్పుడు సగం ఊపిరితిత్తి తీసేశాం.. సిరివెన్నెల మరణానికి కారణం చెప్పిన కిమ్స్ చీఫ్

సినీ పాటల పూదోటలో వికసించిన పుష్పం రాలిపోయింది.అనారోగ్య కారణాలతో తుది శ్వాస విడిచారు పాటల రేడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

 Kims Doctors About Sirivennela Death Reasons Details, Sirivennela, Sirivennela S-TeluguStop.com

ఈనెల 24న న్యుమోనియాతో ఆస్పత్రిలో చేరిన ఆయన నిన్న సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో కన్ను మూశాడు.అయితే ఆయన మరణానికి గల కారణాలను వివరించారు ఆయనకు వైద్యం అందించిన డాక్టర్లు.

కిమ్స్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ భాస్కర్ రావు తాజాగా ఆ వివరాలను వెల్లడించాడు.ఇంతకీ ఆయన చెప్పిన విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సిరివెన్నెల సీతారామ శాస్త్రికి ఆరేళ్ల క్రితం క్యాన్సర్ సోకినట్లు చెప్పారు.అప్పుడు తనకు సగం ఊపిరితిత్తి తీసేయాల్సి వచిందని చెప్పారు.

ఆ తర్వాత ఆయనకు బైపాస్ సర్జరీ చేసినట్లు వెల్లడించారు.వారం రోజుల క్రితం మళ్లీ క్యాన్సర్ వచ్చినట్లు చెప్పాడు డాక్టర్ భాస్కర్ రావు.

దీంతో మరో సగం ఊపిరితిత్తి తీసేయాల్సి వచ్చిందని వెల్లడించాడు.ఆ తర్వాత రెండు రోజుల పాటు బాగానే ఉన్నట్లు చెప్పాడు.

రెండు రోజుల అనంతరం ఆరోగ్య సమస్యలు వచ్చినట్లు వెల్లడించాడు.దీంతో అత్యాధునికవైద్యం కోసం కిమ్స్ కు తీసుకొచ్చినట్లు చెప్పాడు.… దీంతో అడ్వాన్స్ డ్ ట్రీట్మెంట్ కోసం కిమ్స్ కు తీసుకొచ్చారని వెల్లడించారు.

Telugu Cancer, Kims, Kimsmd, Lungs Cancer, Siri Vennela, Sirivennela, Tollywood,

కిమ్స్ లో రెండు రోజుల పాటు వైద్యాన్ని అందించినట్లు వెల్లడించాడు.ఆ తర్వాత తన ఆరోగ్యం కాస్త మెరుగు పడినట్లు చెప్పాడు.ఆ తర్వాత ప్రికాస్టమీ చేశామని వెల్లడించాడు.

అప్పుడు 45 శాతం ఊపిరితిత్తి తీసేసి నట్లు వెల్లడించాడు.అయితే మిగిలిన ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ వచ్చినట్లు చెప్పాడు.

దీంతో ఆయనకు ఎక్మో మిషన్ అమర్చినట్లు చెప్పారు.

Telugu Cancer, Kims, Kimsmd, Lungs Cancer, Siri Vennela, Sirivennela, Tollywood,

అయితే గడిచిన 5 రోజులుగా ఆయనకు ఎక్మో మిషన్ మీదనే వైద్యం కొనసాగినట్లు వెల్లడించాడు.క్యాన్సర్, పోస్ట్ బైపాస్ సర్జరీ, కిడ్నీ డ్యామేజ్ తో పాటు ఒబేసిటీ సమస్య ఉండటంతో ఆయనకు ఇన్షెక్షన్ శరీరం అంతా వ్యాపించినట్లు చెప్పాడు.దీంతో సిరివెన్నెల సీతారామ శాస్త్రి చనిపోయాడని వెల్లడించాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube