వావ్.. 19 లక్షలు విరాళం ఇచ్చిన యంగ్ బ్యూటీ.. ఎంత మంచిమనసు?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో పని చేసే సెలబ్రిటీలు పెద్ద మొత్తంలోనే రెమ్యునరేషన్ తీసుకుంటారు.ఈ క్రమంలోనే ఏదైనా ప్రకృతి విపత్తు కలిగి తీవ్రమైన నష్టం వాటిల్లితే చిత్రపరిశ్రమ ముందుకు వచ్చి తమ వంతు సాయంగా డబ్బును విరాళంగా ప్రకటిస్తూ అందరిని ఆదుకోవడం మనం చూస్తూనే ఉన్నాం.

 Kim Yoo Jung Makes A Generous Donation In Conjunction With Her Birthday Kim Yoo-TeluguStop.com

ఈ క్రమంలోనే కరోనా వంటి విపత్కర సమయంలో ఎంతో మంది సెలబ్రిటీలు ముందుకు వచ్చి వివిధ రకాల సేవా కార్యక్రమాలలో పాల్గొని వారి దాతృత్వాన్ని చాటుకున్నారు.

ఇలా ఏదైనా ఆపద వస్తే వెంటనే మేమున్నామంటూ ఎంతో మంది తారలు ముందుకు వస్తున్న ఈ రోజుల్లో కొరియన్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నటువంటి కిమ్ యూ జంగ్ తన విశాల హృదయాన్ని మంచు మనసు పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

సెప్టెంబర్ 22వ తేదీ ఈ స్టార్ హీరోయిన్ 22 వ ఏట అడుగు పెట్టింది.ఈ క్రమంలోనే సెప్టెంబర్ 22వ తేదీ తన పుట్టిన రోజు కావడంతో ఏకంగా ఈ హీరోయిన్ అక్టోబర్ 1వ తేదీన గ్రీన్ అంబ్రెల్లా చైల్డ్ ఫౌండేషన్ కి తన వంతు సహాయంగా ఏకంగా 30 మిలియన్ల వోన్ (కొరియన్ కరెన్సీ) లను విరాళంగా అందజేసి వార్తల్లో నిలిచారు.

Telugu Chidren, Child, Green Ambrella, Kim Yoo Jung, Koriyan-Movie

ఈ హీరోయిన్ అందజేసిన విరాళం మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 19 లక్షలకి సమానం.కేవలం పుట్టినరోజుకు చైల్డ్ ఫౌండేషన్ కోసం ఇంత పెద్ద మొత్తంలో విరాళం అందించిన ఈ హీరోయిన్ పై నెటిజన్లు పెద్దఎత్తున ప్రశంసలు కురిపిస్తున్నారు.ఈమె స్టార్ హీరోయిన్ గా కొనసాగడమే కాకుండా గ్రీన్ నోబెల్ క్లబ్ మెంబర్ కూడా కావడంతో ఈ ఎన్జీవో సమస్త 100 మిలియన్ వోన్ లను విరాళంగా ఇచ్చింది.ఇలా విరాళంగా ఇచ్చిన డబ్బులు చిన్నారుల వైద్యం కోసం ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి ఉపయోగించాలని ఈ సందర్భంగా కిమ్ తెలియజేశారు.

ఏది ఏమైనప్పటికీ ఇంత చిన్న వయసులోనే అంత పెద్ద మనసు ఉండటం పట్ల నెటిజనులు ఈ హీరోయిన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube