అణుదాడికి రెడీ అంటున్న కిమ్ జోంగ్ ఉన్.. అమెరికా, సౌత్ కొరియాపై కన్నెర్ర..

దక్షిణ కొరియా, అమెరికా దేశాలు మిత్రత్వం చాలా ఏళ్లుగా ఉంది.ఈ తరుణంలో ఈ రెండు దేశాలూ కలిసి సంయుక్త సైనిక విన్యాసాలను 11 రోజుల పాటు చేయనున్నాయి.

 Kim Jong Un Who Says He Is Ready For A Nuclear Attack Connera Against America A-TeluguStop.com

దీనిపై ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్( Kim Jong Un ) కన్నెర్ర చేశారు.అణుదాడికి సిద్ధంగా ఉండాలని తన సైన్యాన్ని ఆదేశించాడు.

అమెరికా, దక్షిణ కొరియా యుద్ధ విన్యాసాలకు ప్రతిస్పందనగా ఉత్తర కొరియా శని, ఆదివారాల్లో సైనిక విన్యాసాలు నిర్వహించింది.ఈ సమయంలో మాక్ అణు వార్‌హెడ్‌( mock nuclear warhead )ను మోస్తున్న బాలిస్టిక్ క్షిపణిని కూడా ప్రదర్శించారు.

వ్యూహాత్మక అణు దాడిలో భాగంగా 800 మీటర్ల ఎత్తులో మాక్ న్యూక్లియర్ వార్‌హెడ్‌లతో కూడిన బాలిస్టిక్ క్షిపణి 800 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాలను కూడా చేధించనుంది.

గత ఒక నెలలోనే, ఉత్తర కొరియా( North Korea ) అనేక క్షిపణులను ఒకదాని తరువాత ఒకటి పరీక్షించింది.యుఎస్, దక్షిణ కొరియా యుద్ధ విన్యాసాలను ఉత్తర కొరియా వ్యతిరేకిస్తోంది.ఈ యుద్ధ విన్యాసాలు మార్చి 13న ప్రారంభం అయ్యాయి.

మార్చి 23 వరకు జరగనున్నాయి.ఉత్తర కొరియాకు చెందిన ఎనిమిది లక్షల మంది ప్రజలు అమెరికాకు వ్యతిరేకంగా యుద్ధం కోసం సైన్యంలో చేరాలని కోరుకుంటున్నారు.

ఇందులో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, శ్రామిక వర్గాలు కూడా ఉన్నాయి.అంతకుముందు ఉత్తర కొరియా హాస్వాంగ్ -17 ( Haswang -17 )ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ క్షిపణి (ఐసిబిఎం)ను పరీక్షించింది.

దక్షిణ కొరియా అధ్యక్షుడు టోక్యోకు వెళుతున్నప్పుడు ఉత్తర కొరియా ఇలా చేసింది.అమెరికా, దక్షిణ కొరియాలకు ‘కఠినమైన హెచ్చరిక’ ఇవ్వడానికి దీనిని ఇంటర్ ఇంటర్నల్ బాలిస్టిక్ మిస్సైల్ (ఐసిబిఎం) ‘హ్వాస్గ్ఫో -17’ పరీక్షించామని ఉత్తర కొరియా తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube