కరోనా వచ్చిందో కాల్చేస్తార్రో ? ఆ దేశంలో ఎప్పుడూ ఇంతేగా ?

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఎఫెక్ట్ కారణంగా ప్రపంచంలోని దాదాపు 190 దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నాయి.ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలుతోంది.

 Kim Jong Un Warns 'serious Consequences' If Coronavirus Breaks Out Coronavirus,-TeluguStop.com

నిరుద్యోగం పెరుగుతోంది.జనాలు ఇళ్ల నుంచి బయటకి వచ్చేందుకు వణికిపోతున్నారు.

తప్పనిసరి పరిస్థితుల్లో బయటకి వస్తున్నా ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది.చైనాలో పుట్టి పెరిగిన ఈ వైరస్ అక్కడ తగ్గుముఖం పట్టినా, ప్రపంచ దేశాలకు పెద్దన్నగా ఉంటూ వస్తున్న అమెరికాను కూడా గజగజలాడిస్తుంది.

అన్ని దేశాలు ఈ వైరస్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.భారతదేశంలో ఈ కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకు పెరుగుతూనే ఉన్నా కట్టుదిట్టమైన ఏర్పాట్లు ప్రభుత్వాలు చేస్తున్నాయి.

ఇక ప్రపంచ దేశాలు అన్నీ లాక్ డౌన్ అయ్యాయి.ప్రజలు ఎవరు రోడ్లపైకి రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు అన్ని దేశాలు చేస్తున్నాయి.

అన్ని దేశాల సంగతి పక్కన పెడితే ఉత్తరకొరియా లో మాత్రం కరోనా పై గట్టి చర్యలే తీసుకున్నారు ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్.ఆ దేశస్థులు ఎవరికైనా కరోనా వ్యాధి సోకితే కాల్చి పారేయండి అంటూ ఆయన ఆదేశాలు జారీ చేయడంతో ప్రపంచ దేశాలన్ని ఒక్కసారిగా విరుచుకు పడ్డాయి.అసలు కిమ్ సంగతి ప్రత్యేకంగా చెప్పుకోనవసరంలేదు.ఆయన ఎంతటి కఠిన నిర్ణయాలు తీసుకుంటూ దుర్మార్గంగా వ్యవహరిస్తాడో అందరికీ బాగా తెలుసు.అనేక మందిని ఊచకోత కోసిన ఘనమైన చరిత్ర కూడా కిమ్ కు ఉంది.ఇవే కాకుండా అణ్వాయుధాలను తయారు చేస్తూ ఇతర దేశాలను బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటాడు.

ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాధి ఉధృతమవుతున్నా, తమ దేశంలో ఆ వైరస్ లేదంటూ కిమ్ చెబుతూ వస్తుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

కరోనా వైరస్ ఉత్తర కొరియాలోకి ప్రవేశించ కుండా కింగ్ ముందస్తు జాగ్రత్తలు గట్టిగానే తీసుకున్నారు.

దేశ సరిహద్దులను మూసివేశారు.అయితే కరోనా వైరస్ సోకి పెద్ద ఎత్తున సైనికులు మరణించినట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ప్రజలు ఎవరు ఇళ్ల నుంచి బయటకు రావొద్దు అంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు.అయితే ఇటువంటి హెచ్చరికలు అన్ని దేశాలు చేసినా కిమ్ మాత్రం ప్రజలు ఎవరైనా ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించి రోడ్లపైకి వస్తే వెనుకా ముందూ చూడకుండా కాల్చి చంపేయమని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఒకవైపు తమ దేశంలో కరోనా వైరస్ లేదు అంటూనే మరోవైపు అటువంటి దుర్మార్గపు చర్యలకు కిమ్ పూనుకోవడం విమర్శలకు కారణం అవుతోంది.కరోనా వైరస్ పరీక్షలు, మాస్కులు, ఇతర వైద్య పరికరాల కోసం ఇతర దేశాలను వేడుకుంటూ ఉండడం చర్చనీయాంశంగా మారింది.

అలాగే ఉత్తర కొరియాలో ఉన్న విదేశీయులను నిర్బంధంలో తీసుకోవడమే కాకుండా, వారి గురించి ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్తలు పడుతున్నట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తా కథనాలు వస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube