" ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండు "

ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ను రష్యా హెచ్చరించింది.దుందుడుకు చర్యలు తగదని హితవు పలికింది.

 Russia Warns North Korea Over Threats Of Nuclear Strike-TeluguStop.com

శత్రుదేశాలను ఎదుర్కోవడానికి అణ్వాయుధాలను ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నామంటూ కిమ్ చేస్తున్న ప్రకటనలు అంతర్జాతీయ న్యాయ చట్టాల ఉల్లంఘన కిందకు వస్తాయని, తద్వారా ఉత్తర కొరియాపై సైనిక చర్యకు దిగే చట్టపరమైన అవకాశం ఉంటుందని హెచ్చరిస్తూ రష్యా విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.అంతర్జాతీయ అణ్వాయుధ నిరోధక చట్టాలను దిక్కరిస్తూ హైడ్రోజన్ బాంబు ప్రయోగించి కిమ్ దూకుడును ప్రదర్శించిన విషయం తెలిసిందే.

అనంతరం అణ్వాయుధాలను ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నామంటూ బాలిస్టిక్ క్షిపణుల ద్వారా సుదూర ప్రాంతాల్లోని లక్ష్యాలను సైతం ఛేదించేలా అణ్వాయుధాలను సూక్ష్మీకరించడంలో ఉత్తర కొరియా విజయం సాధించినట్లు కిమ్ ప్రకటించారు.ఉద్రిక్త పరిస్థితుల మధ్య అమెరికా, ఉత్తర కొరియా సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా చర్యలపై రష్యా చేసిన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube