ఆ వీడియోలు బాలుడు చూశాడని.. దేశ అధ్యక్షుడు కిమ్ ఏ శిక్ష వేసాడంటే..?!

ఉత్త‌ర‌కొరియా దేశాధ్య‌క్షుడు కిమ్ జోంగ్ ఉన్ పేరు వింటేనే ఆదేశ ప్రజలు భయపడిపోతుంటారు.ఆయన ఉత్తర కొరియాకు ప్రపంచంతో సంబంధాల్లేకుండా చేసిన అధ్యక్షుడు.

 Kim Jong Un Gives Punishment Of Social Exclusion For A Boy Who Watched Porn , Ki-TeluguStop.com

ఆయన పాలనలో శిక్షలు ఎంత కఠినంగా ఉంటాయో అందరికి తెలిసిన విషయమే.అయితే తాజాగా నార్త్ కొరియాలో.

పోర్న్ చూడటాన్ని నిషేధించాడట కిమ్.

ఈ మేరకు అధికార వర్కర్స్ పార్టీ ఆధ్వర్యంలో అశ్లీలతకు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారట.

ఎవరైనా పోర్న్ చూస్తే కఠినంగా శిక్షిస్తానని కూడా హెచ్చరించాడట.అయితే.

ఈ క్రమంలోనే ఓ బాలుడు సెక్స్ వీడియోలు చూస్తూ దొరికిపోయాడట.తాజాగా మరోసారి కిమ్ క్రూరత్వం బయటపడింది.

పోర్న్ వీడియోలు చూస్తూ పట్టుబడిన ఓ బాలుడికి, అత‌ని కుటుంబానికి అత్యంత భయంకరమైన శిక్ష విధించాడు కిమ్‌.

అయితే, ఇటీవల ఓ బాలుడు తన తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో పోర్న్ మూవీ పెట్టుకొని చూస్తున్నాడు.

కానీ, ఐపీ అడ్రెస్ ని ట్రాక్ చేసి ఉత్తరకొరియా పోలీసులు అతడి ఇంటి చిరునామాను కనిపెట్టారు.బాలుడు పోర్నో చూస్తున్న సమయంలోనే అతడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

ఈ విషయం నియంత కిమ్ దృష్టికి వెళ్ల‌డంతో స‌ద‌రు బాలుడికి, అతని కుటుంబానికి ఆయ‌న‌ భయంకరమైన శిక్షను విధించాడు.

Telugu Boy, Kim Jong Un, Kim Jong, Korea, Porn, Principal, Latest-Latest News -

ఇక సదరు బాలుడు, అతడి కుటుంబసభ్యులను సమాజ బహిష్కరణ శిక్ష విధించారు.ఆ కుటుంబాన్ని దేశ సరిహద్దు ప్రాంతానికి తరిమేశారు.బాలుడిని ఉరి తీయకపోవడం అదృష్టం అని అక్కడి స్థానిక మీడియా ఓ కథనంలో పేర్కొంది.

అంతేగాక ఆ బాలుడు చదువుతున్న స్కూల్ ప్రిన్సిపాల్‌కు సైతం కిమ్ శిక్ష విధించాడు.ప్రిన్సిపాల్‌ ను లేబర్ క్యాంప్ కు త‌ర‌లించారు.ఉత్తరకొరియా చట్టాల ప్రకారం.పాఠశాల పిల్లలు ఏదైనా తప్పుచేస్తే దానికి పాఠశాల ప్రిన్సిపాలే బాధ్యత వహించాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube