కిమ్ కు లేఖ రాసిన ట్రంప్ అందులో అద్భుతమైన విషయం ఉందన్న కిమ్

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఉత్తర కొరియా అధ్యక్షుడు,నియంత కిమ్ జోంగ్ ఉన్ కు లేఖ రాసినట్లు తెలుస్తుంది.ఇటీవల కిమ్ నుంచి ట్రంప్ కు లేఖ అందిన సంగతి తెలిసిందే.

 Kim Jong Un And Trump Still Write To Each Other 1 1-TeluguStop.com

కిమ్ మంచి లేఖ రాశారు అంటూ ట్రంప్ ఇటీవల వ్యాఖ్యానించారు కుడా.అయితే దానికి ప్రతిగానే ట్రంప్ తిరిగి కిమ్ కు లేఖ రాసినట్లు తెలుస్తుంది.

అయితే ఆ లేఖ లో ట్రంప్ ఏమి రాసారో తెలుసా.ఆ లేఖలో అద్భుతమైన విషయం ఉందన్న కిమ్, ఆ లెటర్ అందుకున్న తరువాత ట్రంప్ ని పొగడ్తల తో ముంచెత్తారట.

ఈ విషయాన్ని ఆ దేశ అధికార వార్తా సంస్థ కేసీఎంఏ వెల్లడించింది.ఆ లేఖలో అద్భుతమైన విషయం ఉందని, ట్రంప్ ధైర్యం అసామాన్యం అంటూ కిమ్ ప్రశంశల వర్షం కురిపించారని కేసీఎంఏ పేర్కొంది.

అయితే ఈ లెటర్ ట్రంప్ ఎప్పుడు రాశారు.

ఈ లెటర్ కిమ్ కు ఎప్పుడు చేరిందన్న విషయాన్ని మాత్రం వార్తా సంస్థ వెల్లడించలేదు.

అలానే ఈ విషయం పై వైట్ హౌస్ కూడా ఇప్పటివరకు అధికారికంగా ఏమి ప్రకటించలేదు కూడా.దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.ఒకప్పుడు ఉప్పు-నిప్పుగా ఉన్న ఈ ఇద్దరు దేశాధినేతల మధ్య ఇటీవల స్నేహ భావం ఎక్కువగా కనిపిస్తుంది.ఈ క్రమంలోనే ఒకరినొకరు ఉత్తరాలు కూడా రాసుకొనే వరకు వారి మధ్య సంబంధాలు కొనసాగుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube