దేశంలో పెంపుడు కుక్కలపై కిమ్ కన్ను.. కారణం ఏంటంటే?

ఉత్తర కొరియాలో ఎన్ని కఠినమైన నియమాలు ఉంటాయి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఆ దేశ అధ్యక్షుడు కిమ్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అనేది ఎవరికి తెలియదు.

 Kim Jong, North Koreans, Pet Dogs-TeluguStop.com

అతని ఆదేశం లేనిదే ఎవరు ఏం చెయ్యరు.అతను తీసుకునే నిర్ణయాల కారణంగా ఎంతోమంది ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదర్కొంటున్నారు.

ముఖ్యంగా ఆహారం లేక ఎంతోమంది ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.ప్రజల నుంచి వచ్చే పన్నులను ఆయుధాలు సమకూర్చుకోవడం కోసమే దృష్టిపెట్టడంతో ఆ దేశంలో వ్యవసాయం, పాడిపరిశ్రమ దారుణంగా దెబ్బ తినింది.

దీంతో ఆ దేశంలో భారీగా ఆహారం కొరత ఏర్పడింది.దాదాపు 25.5 మిలియన్ల మందికి అక్కడ తిండి దొరకడం లేదు.

మాంసాహారంలో ఉండాల్సిన కోళ్లు, మేకలు వంటి వాటికీ కొరత ఏర్పడింది.

కేవలం అవి మాత్రమే కాదు పందులు కొరత కూడా ఏర్పడింది.దీంతో మాంసం కోసం అక్కడ కుక్కలను వినియోగిస్తున్నారు.

వీటి వినియోగం కూడా రోజు రోజుకు పెరిగిపోవడంతో వీటి కొరత కూడా ఏర్పడే అవకాశం వచ్చింది.

దీంతో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.

ఉత్తర కొరియా దేశంలో పెంచుకునే కుక్కలను సైతం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది.ఆ కుక్కలను కూడా ఆహారంగా వినియోగించాలని కిమ్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

దీంతో కిమ్ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube