ఆ భయంతో అజ్ఞాతంలోకి కిమ్ ?

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ప్రపంచ దేశాల్లో అత్యంత నియంత్రత్వ పోకడలు ఉన్న పాలకుడిగా గుర్తింపు పొందారు.

 Kim Into Hiding Because Of That Fear Details, Kim Jang Unn, South Korea,north Ko-TeluguStop.com

వింత వింత నిర్ణయాలు తీసుకుంటూ కఠినమైన శిక్షలను అమలు చేస్తూ పౌరులను అనేక చిత్రహింసలకు గురి చేయడంలో కిమ్ ను మించిన వారు ఉండరు.ఆ దేశంలో విధించే శిక్షలు అధ్యక్ష హోదాలో కిమ్ తీసుకునే నిర్ణయాలపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతూనే ఉంటుంది.

తనపై ఎన్ని విమర్శలు వచ్చినా తన వైఖరిని మార్చుకునేందుకు ఆయన ఏమాత్రం ఇష్టపడరు.గత 20 రోజులుగా కిమ్ జాంగ్ అజ్ఞాతంలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఆయన ప్రభుత్వం నిర్వహించే కీలక కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు.

అసలు ఆయన ఎందుకు అజ్ఞాతంలో ఉన్నారు అనే విషయం పైన ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

గతవారం సైన్యం నిర్వహించిన క్షిపణి పరీక్షల్లోనూ దేశంలో నెలకొన్న తీవ్ర ఆహార కోరతపై నిర్వహించిన సమీక్షకు కిమ్ హాజరు కాకపోవడంతో ఆయనపై అందరికీ ఆరా మొదలైంది.ఆయన ఉత్తర కొరియాకు ఈశాన్య దిశగా ఉన్న భారీ ఫామ్ హౌస్ లో పూర్తిగా విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతుంది అక్టోబర్, నవంబర్ నెలలో ఉత్తర కొరియాలో ఫ్లూట్ సీజన్ మొదలవుతుంది కరోనా విజృంభించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉండటంతో ఉత్తర కొరియాలో మాస్క్ ధరించడం తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

అంతేకాకుండా వెంటనే కరోనా ఆంక్షలను కూడా అమలులోకి అధికారులు తీసుకువచ్చారు.ఈ నేపథ్యంలో కిమ్ ఫార్మ్ హౌస్ లో విశ్రాంతి తీసుకుంటూ జనాలకు దూరంగా ఉంటున్నట్లుగా అనుమానాలు కలుగుతున్నాయి. అక్టోబర్ 10వ తేదీన అధికార పార్టీ 77వ ఆవిర్భావ వార్షికోత్సవ వేడుకలు జరగాల్సి ఉంది.ఈ కార్యక్రమానికి కిమ్ హాజరు కావాల్సి ఉంది.ఆ కార్యక్రమానికి కనుక హాజరు కాకపోతే మరిన్ని అనుమానాలు పెరుగుతాయి.కిమ్ ఆరోగ్య పరిస్థితి ఆయన అజ్ఞాతవాసం పై ఉత్తరకొరియా ప్రత్యర్థైన దక్షిణ కొరియా ఎక్కువగా ఆరా తీస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube