ఇంటింటికీ ఉచితంగా కిలో చికెన్... ఎక్కడంటే...?

కరోనా వైరస్ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉండటంతో ఈ మధ్య కాలంలో చికెన్ విక్రయాలు పడిపోతున్నాయి.నిజానికి కరోనా వైరస్ కు చికెన్ కు ఎటువంటి సంబంధం లేకపోయినా కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో చికెన్ తింటే కరోనా వస్తుందని వదంతులను ప్రచారం చేయడంతో చికెన్ విక్రయాలు తగ్గాయి.

 Kilo Chicken For Free-TeluguStop.com

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు చికెన్ తింటే కరోనా రాదని పత్రికా ప్రకటన విడుదల చేశాయి.

అయినా ప్రజలు మాత్రం చికెన్ తినటానికి ఆసక్తి చూపటం లేదు.

కొన్ని ప్రాంతాలలో కిలో చికెన్ 30 రూపాయలకు విక్రయిస్తుండగా మరికొన్ని ప్రాంతాలలో ప్రజలకు కోళ్లను ఉచితంగా పంచుతున్నారు.తాజాగా చికెన్ తింటే కరోనా రాదని నమ్మించడానికి కృష్ణా జిల్లాలోని గూడూరు మండలం గండమ్ గ్రామంలో సాయి గణేష్ చికెన్ వ్యాపారులు గ్రామంలోని ప్రతి ఇంటికి కిలో కోడి మాంసాన్ని ఉచితంగా పంపిణీ చేశారు.

గ్రామంలోని ప్రతి ఇంటికి చికెన్ ను పంపిణీ చేయడం ద్వారా చికెన్ తింటే కరోనా రాదని ప్రజలు విశ్వసిస్తారని తాము భావిస్తున్నామని చెప్పారు.ప్రభుత్వం కూడా చికెన్ తింటే కరోనా రాదని విసృతంగా ప్రచారం నిర్వహించాలని తాము కోరుతున్నామని చెప్పారు.

చికెన్ తో పాటు గారెలను కూడా పంచి ప్రభుత్వ ప్రకటనను ప్రజలకు చెప్పి చికెన్ తింటే కరోనా రాదని సాయి గణేష్ చికెన్ నిర్వాహకులు వినూత్నంగా ప్రచారం నిర్వహించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube