మమ్మల్ని చంపేయండి కలెక్టర్ గారు : ఉద్యోగుల డిమాండ్ ! ఎందుకు ఎక్కడ ?

ఉన్నతాధికారులు కింది స్థాయి ఉద్యోగుల మధ్య సమన్వయం ఉండకపోతే ఆ శాఖ వ్యవహారాలు గందరగోళంగా మారి అది తీవ్ర అసంతృప్తికి దారితీయడమే కాకుండా ప్రజల ముందు లోకువ అయ్యే పరిస్థితి వస్తుంది.ఇప్పుడు అదే పరిస్థితి తలెత్తడంతో ఓ జిల్లాలోనే ఉద్యోగులంతా మమ్మల్ని చంపేయండి సార్ లేకపోతే మీరైనా మారండి అంటూ డిమాండ్ చేయడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది.

 Kill Us Sir Employees Demand On Collector-TeluguStop.com

అయితే దాని వెనుక ఉన్న కారణాలు, వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఏపీలోనే శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ నివాస్ తీరుపై ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులంతా ఏకమై నిరసన గళం వినిపిస్తున్నారు.

అర్ధరాత్రి వరకు సమావేశాలు నిర్వహిస్తూ తమపై తీవ్రమైన ఒత్తిడి తీసుకువస్తున్నారని, తమపై అనవసర ఒత్తిడి పెంచడమే కాకుండా వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు అంటూ ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.ఈ మేరకు ఆదివారం సాయంత్రం శ్రీకాకుళం రెవెన్యూ అసోసియేషన్‌ భవనంలో రెవెన్యూ, ఏపీఎన్జీవో, పంచాయతీరాజ్‌, పశుసంవర్థకశాఖ, డ్వామా, వీఆర్‌ఏ, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీవోల అసోసియేషన్ల ఆధ్వర్యంలో కలెక్టర్ తీరుపై చర్చించేందుకు సమావేశం నిర్వహించారు.

అర్ధరాత్రి వరకు కలెక్టర్ సమావేశాలు నిర్వహిస్తూ ఆయన ఇగో చల్లారాక సమావేశాలు ముగిస్తున్నారు.కలెక్టర్‌ వైఖరి పై ప్రతి ఉద్యోగీ బాధపడుతున్నారు.

చాలా సమయాల్లో కన్నీరు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉద్యోగులకు దాపురించింది.ఇంతకుముందెన్నడూ ఇలాంటి పరిస్థితి చూడలేదు.

వీడియో కాన్ఫరెన్స్‌బాధపడుతున్నారని, నాలుగు నెలలుగా చాలా వేదింపులకు గురవవుతున్నామని ఉద్యోగులంతా ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా రెవెన్యూ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు కాళీప్రసాద్‌, వీఆర్‌వో అసోసియేషన్‌ అధ్యక్షులు వేణుగోపాల్‌ మాట్లాడుతూ జిల్లాలోనే ఉద్యోగస్థులందరిని సైనైడ్‌ ఇచ్చి చంపేయాలని, లేదా కలెక్టర్‌ వైఖరిలోనైనా మార్పురావాలని డిమాండ్‌ చేశారు.

త్వరలోనే కలెక్టర్ తీరుపై ఫిర్యాదు చేసేందుకు సీఎం ను కలుస్తామని వారు చెప్పారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube