మా నాన్నని చంపేయండి అంటున్న రవిబాబు

రోజులు గడుస్తున్నాయి, అయినా చలపతిరావు వివాదం ఇంకా తాజాగనే ఉంది.రోజుకో ఛానెల్ లో డిబేట్, దాంట్లోకి మహిళా సంఘాలవారు రావడం, అల్రెడి క్షమాపణలు అడిగిన చలపతిరావుని మళ్ళీ క్షమాపణలు అడగటం, నాలుగైదు మాటలు అనేసిపోవడం.

 Kill My Father – Says Ravi Babu On Chalapathi Rao-TeluguStop.com

సినిమా స్టార్లు, యాంకర్లు, స్థాయి, వయసు తేడా లేకుండా అంతా అనడమే.తప్పుని నిందించడంలో తప్పులేదు కాని, కేవలం చలపతిరావునే టార్గేట్ చేయడం తప్పేమో, అదికూడా క్షమాపణ అడిగిన తరువాత.

ఈ విషయం మీద స్పందించిన చలపతిరావు కుమారుడు, నటుడు, దర్శకుడు రవిబాబు అందరికి చెంపపెట్టు సమాధానమే ఇచ్చారు.

తమ తల్లి చిన్నప్పుడే చనిపోతే, మళ్ళీ పెళ్ళి చేసుకుంటే వచ్చే ఆవిడ మమ్మల్ని ఎలా చూసుకుంటుందో అని, ఎవరెంత చెప్పిన పెళ్ళి చేసుకోలేదు, అలాంటి ఆయనకి ఈ వయసులో మదపిచ్చి పట్టిందని అనడం ఆశ్చర్యకరమని, మా నాన్న చేసిన తప్పుకి క్షమాపణలు చెప్పి, పశ్చాత్తాపపడినా, ఆయనను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు, ఇంతకంటే ఘోరమైన మాటలు మాట్లాడిన సీనిపెద్దలున్నా, వారి రేంజి పెద్దది కాబట్టి ఎవరు ఏమి అనలేదని, ఇలా రోజు మానసికంగా వేధించి చంపేకన్నా, ఒక్కసారి శారీరకంగా చంపేయ్యండి అంటూ ఆవేదనను వ్యక్తం చేసారు రవిబాబు.

ఈ వివాదాన్ని పక్కనపెడితే, చలపతిరావు పిల్లల కోసం త్యాగాలు విలువకట్టలేనివి.ఆయన 28 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడే భార్యని పోగొట్టుకున్నారు.

అప్పటికి పదేళ్ళ వయసు కూడా దాటని ముగ్గురు పిల్లలున్నారు.అప్పటికి ఆయన పేరు మోసిన ఆర్టిస్టు కాదు.

పది పదిహేను కిలోమీటర్ల నడిచి వెళుతూ, చిన్ని చిన్న వేషాలు వేసుకుంటూ పిల్లల్ని పెంచుకున్నారు.రెండొవ పెళ్ళి చేసుకొమ్మని స్వయంగా సీనియర్ ఎన్టీఆర్ చెప్పినా వినిపించుకోలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube