అతితెలివి ప్రదర్శించాడు...చివరికి నవ్వుల పాలయ్యాడు.! మొన్నటి మ్యాచ్ లో జరిగిన వింత సంఘటన ఇదే.!

వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20లో భారత్ ఘనవిజయం సాధించి సిరీస్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.అయితే ఈ మ్యాచ్‌లో విండీస్‌ ఇన్నింగ్స్‌ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.

 Kieron Pollards On Field Antics Leave Jasprit Bumrah Furiou-TeluguStop.com

బుమ్రా వేసిన 11 ఓవర్‌లో విండీస్‌ విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ కీరన్‌ పొలార్డ్‌ తన అతి తెలివిని ప్రదర్శించాడు.కానీ చివరికి నవ్వుల పాలయ్యాడు.

అసలు ఏమైంది అంటే.?

బుమ్రా వేసిన నాలుగో బంతిని పొలార్డ్‌ షాట్‌ ఆడే ప్రయత్నం చేయగా.అది బ్యాట్‌ అంచుకు తగిలి అక్కడే గాల్లోకి లేచింది.ఈ క్యాచ్‌ అందుకోవడానికి బుమ్రా వెళ్లగా పొలార్డ్‌ అతని దృష్టిని మరల్చేలా చేయిని కదిపాడు.

అయినా క్యాచ్‌ అందుకున్న బుమ్రా పొలార్డ్‌ వైపు ఆగ్రహంగా చూశాడు.అతను మాత్రం నవ్వుతూ క్రీజును వదిలాడు.

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ మ్యాచ్‌లో రోహిత్‌ అద్భుత సెంచరీతో చెలరేగడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది.అనంతరం ఈ భారీ లక్ష్యచేధనలో తడబడ్డ విండీస్‌ 9 వికెట్లు కోల్పోయి 124 పరుగులు మాత్రం చేయగలిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube