చిన్న పిల్లల కోసం అదిరిపోయే ఫీచర్ తీసుకరాబోతున్న నెట్ ఫ్లిక్స్..!

కరోనా సమయంలో థియేటర్స్ అన్నీ మూతపడడంతో ఓటిటీ ఫ్లాట్ ఫామ్ పై ప్రజలు అందరు దృష్టి సారించారు.ఎంచక్కా ఇంట్లో కూర్చిని సినిమాలు చూసేస్తున్నారు.

 Kids , Netflix, Games, New Features, Ott, New Update, Social Media,latest News-TeluguStop.com

చిన్నా సినిమా దగ్గర నుండి పెద్ద హీరో సినిమాల వరకు ఓటిటిలో రిలీజ్ అవ్వడం విశేషం.ఈ క్రమంలో ఎన్నో రకాలు అయిన ఓటిటీ ఫ్లాట్ ఫామ్ లు అందుబాటులోకి రాగా అందులో ఫేమస్ అయిన వాటిలో నెట్ ఫ్లిక్స్ కూడా ఒకటి.

ఎంటర్టైన్మెంట్ రంగంలో ముందుకు దూసుకుపోతున్న ఈ సంస్థ ఇప్పుడు చిన్నారులు, యూత్ కోసం ఒక సరికొత్త ఆలోచన చేసింది.నెట్ ఫ్లిక్స్ సంస్ధ.

ఇప్పుడు గేమింగ్ రంగంపై దృష్టి పెట్టింది.

ఎందుకంటే ఈ కాలంలో చిన్నారుల దగ్గర నుండి యువత వరకు ఎక్కువగా ఆన్ లైన్ లో ఆటలు ఆడడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు.

దీనిని అవకాశంగా తీసుకుని నెట్ ఫ్లిక్స్ సంస్థ మరింత అభివృద్ధి సాధించాలని చిన్నారుల కోసం ఒక సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానుంది.అంటే మొబైల్ వర్షన్ లో గేమ్స్ అడుకునే విధంగా ఈ కొత్త ఫీచర్ ఉండనున్నట్లు తెలుస్తుంది.

Telugu Games, Netflix-Latest News - Telugu

కరోనా పరిస్ధితుల కారణంగా అడుగు తీసి బయట పెట్టలేని పరిస్థితులలో అందరం ఉన్నాము.ఒక పక్క పిల్లలకు స్కూల్స్ లేవు.మరోపక్క కురాళ్లకు కాలేజీలు లేవు.దీనిని అదునుగా తీసుకుని గేమ్స్ ఆడే పనిలో తెగ బిజీ అయిపోయారు.పిల్లల వీక్ నెస్ తెలుసుకుని నెట్ ఫ్లిక్స్ సంస్థ గేమ్ సీరీస్ స్టార్ట్ చేయాలనీ చూస్తుంది.ఇందుకోసం ప్రస్తుత ఫేస్ బుక్ ఎగ్జిక్యూటివ్ మైక్ వెర్దును తమ గేమ్ డెవలప్మెంట్ వైస్ ప్రెసిడెంట్ గా నెట్ ఫ్లిక్స్ నియమించింది.

వచ్చే ఏడాది చివరిలో కిడ్స్ రీ క్యాప్ ఈమెల్, కిడ్స్ టాప్ 10 రో పేరుతో ఒక సిరీస్ ను విడుదల చేయనున్నట్లు వైస్ ప్రెసిడెంట్ గా నియమితులైన మైక్ వెర్దు తెలిపారు.ఈ సీరీస్ పిల్లలకు బాగా నచ్చుతాయని కూడా ఆయన తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube