పిల్లలకు ‘కోవాగ్జిన్’ ప్రయోగాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నిపుణుల కమిటీ..!

తాజా సమాచారం ప్రకారం భారత ఔషధ తయారీ సంస్థ అయిన భారత్ బయోటెక్ తయారుచేసిన వ్యాక్సిన్ ను రెండు సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వరకు మధ్య వయసు గల వారిపై 2/3 ఫేస్ క్లినికల్ ట్రయల్ కొరకు నిపుణుల కమిటీ సిఫార్సు చేసిందని తెలుస్తోంది.ఈ ప్రక్రియ దేశంలోని పాట్నా, ఢిల్లీ, నాగపూర్ లలో ఉన్న మెడికల్ సైన్సెస్ కళాశాలలో సహా వివిధ ప్రాంతాల్లోని 525 చోట్ల జరిగిపోతున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

 Kids, Covaxine, Medcine, Green Signal, Bharath Bitech,latest News-TeluguStop.com

ఈ సందర్భంగా సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ లో ఉన్న కరోనా సబ్జెక్టుపై ఎక్స్పర్ట్ కమిటీ తాజాగా హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ దరఖాస్తు పై చర్చించి ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.ఇదివరకే భారత్ బయోటెక్ సంస్థ రెండు నుంచి 18 సంవత్సరాల వయస్సు గల వారిపై పరీక్షలు నిర్వహించడానికి అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఆ దరఖాస్తును పూర్తిస్థాయిలో అధికారులు చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు.అయితే ప్రస్తుతం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వారి సహకారంతో భారత్ బయోటెక్ స్వతహాగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ను ప్రస్తుతం భారతదేశంలో కోవిడ్ 19 టీకా డ్రైవ్ లో పెద్దవారికి ఇస్తున్న సంగతి కూడా తెలిసిందే.

ఇందుకు సంబంధించి కంపెనీ దారులు మాట్లాడుతూ కోవిడ్ 19 టీకా వ్యాక్సిన్ ప్రజలకు సరఫరా చేయడంలో ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా చూసుకుంటామని, అలాగే మే 1 నుంచి ఈ వ్యాక్సిన్ దేశంలోని 18 రాష్ట్రాలకు నేరుగా సరఫరా చేయబడుతుందని తెలియజేశారు.ఈ సమాచారాన్ని మొత్తం భారత్ బయోటెక్ తన సోషల్ మీడియా ఖాత ద్వారా ప్రజలకు తెలియచేసింది.

ఇందుకు సంబంధించి ఇప్పటికే ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్, హర్యానా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న భారత్ బయోటెక్ ప్రతినిధులు తెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube