కిడ్నీల్లో రాళ్ళకి కారణమయ్యే అలవాట్లు పొరపాట్లు ఇవి ... మానేయండి

కిడ్నీల్లో రాళ్ళు … పక్కింట్లో ఉండే ముసలాయన రాఘవరావుకే కాదు, ఎదురింట్లో ఉండే కుర్రాడు జగదీష్ కి కూడా వచ్చేసాయి.మరి అంతటి సాధరణ సమస్య అయిపోయింది ఇది.

 Kidney Stones Types Causes Symptoms And Solutions , Kidney Stones,  Symptoms, Pa-TeluguStop.com

ఏ ఊరిలో, ఏ కాలని చూసినా, పది పాతిక మంది ఈ సమస్యతో ఇబ్బందిపడుతుంటారు.కాదనలేని వాస్తవం ఇది.మరి ఎప్పుడైనా భయపడ్డారా? మీకు కూడా కిడ్నీల్లో రాళ్ళు వస్తే ఏంటి పరిస్థితి? అసలు ఇంతమంది ఎందుకు ఈ సమస్య బారిన పడుతున్నారు? దానర్థం మన రోజువారి అలవాట్లు కొన్ని ఆరోగ్యకరమైనవి కావా? కిడ్నిల్లో రాళ్ళు వస్తే ఏంటి ప్రమాదం? అసలు అవి ఎలా వస్తాయి? రాకుండా ఎలా అడ్డుకోవాలి? పూర్తిగా చదివి తెలుసుకోండి.

అసలు కిడ్నీల్లో రాళ్ళు అంటే ఏమిటి? వీటిలో రకాలు ఉన్నాయా?

కిడ్నిల్లో రాళ్ళు అంటే నిజంగానే రాళ్ళు రప్పలు చేరడం కాదు‌.మినరల్స్, ఉప్పు, వాటి మిశ్రమాలు గట్టిగా కిడ్నిల్లో పేరుకుపోవడం.ప్రధానంగా కిడ్నీ రాళ్ళు నాలుగు రకాలు.అవి Cystine Stones, Struvite Stones, Calcium Oxalate Stone మరియు Uric Acid Stone.

కాల్షియం స్టోన్స్ : ఎక్కువగా కాల్షియం వల్ల రాళ్ళు వస్తుంటాయి.విటిమిన్ డి మరీ ఎక్కువగా తీసుకోవడం, అసంపూర్ణమైన డైట్, Oxalate ని ప్రోత్సహించే పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం, మైగ్రేన్ సమస్య ఉండటం మరియు topiramate లాంటి మందులు వాడటం వలన ఇవి రావొచ్చు.

యూరిక్ ఆసిడ్ స్టోన్స్ : నీళ్ళు తక్కువగా తాగే వారికి ఈరకం రాళ్ళు వస్తాయి.అలాగే కొందరికి ద్రవపదార్థాలు ఒంట్లో నిలవవు, అతి మూత్రం, రక్తం కోల్పోతుండటం (స్త్రీలు పీరియడ్స్ లో) వలన ఈ సమస్య రావొచ్చు.

సిస్టీన్ స్టోన్స్ : ఈరకం రాళ్ళు ప్రధానంగా వంశపారంపర్యంగా వస్తాయి‌.వీరి జీన్స్ మూలాన, కిడ్నీలు ఎక్కువగా అమినో ఆసిడ్స్ విపరీతంగా విడుదల చేసి ఈ సమస్యకు కారణమవుతాయి.

స్ట్రువైట్ స్టోన్స్ : ఇంఫెక్షన్స్ వలన ఈరకం రాళ్ళు ఏర్పడతాయి.అంటే, యురినరి ట్రాక్ట్ ఇంఫెక్షన్స్ లాంటివి అన్నమాట.

ఎలా గుర్తించాలి? కిడ్నిల్లో రాళ్ళకి అత్యంత ముఖ్యమైన చికిత్స, వాటిని మొదట్లోనే గుర్తించటం.ఎంత ఆలస్యం చేస్తే అంత చేటు.అలసత్వం ప్రదర్శిస్తే అవి ప్రాణాంతకం కూడా కావచ్చు.మొదట్లోనే గుర్తించి చికిత్స మొదలుపెడితే మంచిది.మరి ఎలా గుర్తించాలి? శరీరం ఏవైనా సూచనలు ఇస్తుందా? అవును, సూచనలు ఇస్తుంది మన శరీరం … అవి ఎలా ఉంటాయంటే.

* మూత్ర విసర్జన లో ఇబ్బంది.

* మూత్రంలో రక్తం

* ఊపిరితిత్తుల కింది నుంచి, ముందు, వెనక, పక్కలో నొప్పి.

* మూత్రంలో దుర్వాసన.ఎరుపు, బ్రౌన్ లేదా పింక్ రంగులో మూత్రం రావడం.

* మూత్రం తక్కువ మొత్తంలో, మాటిమాటికి రావడం.

* వీటితో పాటు వాంతులు, నీరసం.

ఈ సూచనలు కనిపిస్తే డాక్టర్ ని సంప్రదించడం ఉత్తమం.

ఎలాంటి అలవాట్లు మానుకుంటే కిడ్నీల్లో రాళ్ళు ఏర్పడకుండా చూసుకోవచ్చు?

* మంచినీటిని బెఖాతరు చేయకూడదు.నీటిని ప్రేమించండి.అదే ప్రథమ చికిత్స అన్ని సమస్యలకి‌.

* ప్రోటిన్ శరీరానికి అవసరమే.కాని అతిగా మాంసాహారం తినవద్దు.

మాంసాహారం ఆసిడ్స్ ని విడుదల చేస్తుంది.కిడ్నీలు త్వరగా ఆసిడ్స్ బయటకి పంపలేవు.

అవి పేరుకుపోయి రాళ్ళు అవుతాయి.

* సరైన నిద్ర లేకపోతే కిడ్నీల మీద భారం పెరుగుతూనే ఉంటుంది.7-8 గంటల నిద్ర అత్యవసరం.

* ఉప్పు ఎక్కువగా వాడితే కిడ్నిల్లో సోడియం లెవల్స్ పెరిగిపోతాయి.

ఇక్కడే రాళ్ళ సమస్య మొదలయ్యేది.ఉప్పు వాడకం తగ్గించండి.

పచ్చళ్ళు, పిండివంటకాలు తక్కువగా తీసుకోండి.

* పెయిన్ కిల్లర్స్ చాలా చవకగా మెడికల్ షాప్ లో దొరుకుతాయి.

వీటి అమ్మకంపై ఎలాంటి నియంత్రణ లేకపోవడంతో ప్రతి చిన్న నొప్పికి పేయిన్ కిల్లర్స్ వాడతారు కొందరు.కిడ్నిల్లో రాళ్ళకి ఈ అలవాటు కూడా ఓ కారణం.

* ప్రాసెస్డ్ ఫుడ్స్, బేకరి ఫుడ్స్ లేనిదే రోజు గడవదు కొందరికి.కాని ఈ ఫాస్ట్ ఫుడ్ అలవాటు వలన మీరు ఒంట్లో సోడియం మరియు ఫాస్ ఫరస్ లెవల్స్ అవసరానికి మించి పెంచేసి కిడ్నిల్లో రాళ్ళకి కారణమవుతున్నారు.

మిగితా అలవాట్లు : * అతి మద్యపానం * ధూమపానం * ఒకే చోట కూర్చోని పనిచేయడం (వ్యాయామం లేకపోవడం) * ఎక్కువగా చెక్కెర పదార్థాలు తినటం.

Kidney Stones Types Causes Symptoms And Solutions , Kidney Stones, Symptoms, Pain Killers, Cysteine ​​Stones, Calcium Stones - Telugu Calcium, Cysteine, Kidney, Kidneytypes, Pain Killers, Symptoms

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube