ఈ మధ్య కాలం లో ఈ కామర్స్ దిగ్గజం స్నాప్ డీల్ లో పని చేస్తున్న దీప్తీ సర్నా అనే ఉద్యోగిని పెళ్లి చేసుకోవడం కోసం ఒక ఉద్యోగి కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే.ఈ నేపధ్యం లో జాతీయ క్రైమ్ గణాంకాలు చాలా పెద్ద విషయాలే చెబుతున్నాయి.
కిడ్నాప్ ల వెనక ఉన్న వింత విషయాలు వారు బయట పెడుతున్నారు.ఇదివరకు మీద గత పదేళ్ళ కాలం లో అన్నీ పెళ్లి కోసం జరుగుతున్న కిడ్నాప్ లానే చెబుతున్నారు.
2005లో మొత్తం 22832 కిడ్నాప్ లు జరగ్గా అందులో అపహరణకు గురైన మహిళల సంఖ్య 15750.వారిలో పెళ్లి కోసం కిడ్నాపైన వారు 9637 మంది.
ఇక 2014కు వచ్చే సరికి ఈ సంఖ్య అమాంతం పెరిగిపోయింది.మొత్తం 77237 కిడ్నాప్ కేసులు నమోదు కాగా అందులో మహిళల కిడ్నాప్ లు 57311.
అందులో పెళ్లి కోసం చేసిన కిడ్పాప్ లు 30957.ఇలా దుండగులు పెళ్లి కోసం కిడ్నాప్ చేస్తున్న మహిళల్లో సగం మంది 18 నుంచి 29 ఏళ్ల మధ్య వయస్కులు.
ఆ తరువాత 16 నుంచి 17 ఏళ్ల అమ్మాయిల కిడ్నాప్ ల శాతం కూడా ఎక్కువగానే ఉంది.కిడ్నాప్ కు గురైన మిగతా మహిళల్లో ఎక్కువ మందిని రేప్ చేస్తున్నారు.