ఫామ్ హౌస్ తీసుకెళ్తానంటూ కిడ్నాప్‌.. అస‌లు విష‌యం తెలిసి షాక్ అయిన పోలీసులు

Kidnapped As If He Was Being Taken To A Farm House The Police Were Shocked To Know The Real Thing

ఈ మ‌ధ్య జ‌రుగుతున్న దారుణాల్లో ఎన్ని ట్విస్టులు ఉంటున్నాయో అంద‌రికీ తెలిసిందే.మొద‌ట అది ఏదో చిన్న నేరం అనుకుని లైట్ తీసుకుంటే చివ‌ర‌కు అందులో ఉన్న పెద్ద నేరాలు తెలిసి జ‌నాల‌తో పాటు అటు పోలీసులు కూడా ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

 Kidnapped As If He Was Being Taken To A Farm House The Police Were Shocked To Know The Real Thing-TeluguStop.com

ఇప్పుడు రాజమండ్రిలో జ‌రిగిన కిడ్నాప్ ఉదంతం కూడా ఇదే విధంగా తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది.అయితే ఈ కిడ్నాప్ క‌థ వెనుకాల పెద్ద క‌థ ఉన్న‌ట్టు తెలుస్తోంది.

ఇందులో గుప్తనిధుల వ్యవహారం తెర‌మీద‌కు రావ‌డంతో పోలీసులు కూడా ఈ ట్విస్టుకు షాక్ అయిపోతున్నారు.

 Kidnapped As If He Was Being Taken To A Farm House The Police Were Shocked To Know The Real Thing-ఫామ్ హౌస్ తీసుకెళ్తానంటూ కిడ్నాప్‌.. అస‌లు విష‌యం తెలిసి షాక్ అయిన పోలీసులు-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రాజమండ్రికి నాగపూర్ ప‌ట్ట‌ణం నుంచి ఓ నలుగురు వ‌చ్చారు.

కాగా వీరికి త‌న ఫామ్హౌస్ ను చూపిస్తానంటూ హోట‌ల్ య‌జ‌మాని ఓ చోటుకు తీసుకెళ్లారు.తీరా అక్క‌డ‌కు వెళ్లిన త‌ర్వాత త‌న‌కు రూ.5 లక్షలు ఇవ్వాల్సిందేనంటూ బెదిరింపులకు పాల్ప‌డ్డాడు.బెదిరిపోయిన వారు ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ఫోన్ చేసి విష‌జ్ఞం చెప్పారు.

దీంతో ఆయ‌న రాజమండ్రి పోలీసులకు ఫోన్ చేసి విష‌యం వివ‌రించారు.రంగంలోకి దిగిన పోలీసుల‌కు విచారణలో ఆసక్తికర విష‌యాలు తెలిశాయి.

వీరంతా క‌లిసి గుప్త నిధుల విష‌యంలో మాట్లాడుకుంటుండ‌గా తేడా రావ‌డంతోనే ఇలా ఫోన్ చేశార‌ని స‌మాచారం.

ద్వారక తిరుమలకు ప్రాంతంలో నివ‌సించే వ్యక్తితో ఆ న‌లుగురు నాగ‌పూర్ వ్య‌క్తులు రాజానగరం ఫామ్ హౌస్ వ‌ద్ద‌కు వ‌చ్చారు.

అయితే వీరంతా గుప్త నిధుల విషయంలో తేడా రావడంతోనే ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది.గుప్తనిధుల విష‌యంలో మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డంతో వారు రాజాసింగ్‌కు కిడ్నాప్ విష‌య‌మ‌ని అబ‌ద్ధం చెప్పి ఫోన్ చేశార‌ని తెలుసుకున్నారు.

ఇక వారంద‌రినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు త‌మ స్టైల్ లో విచారిస్తున్నారు.అస‌లు ఈ ముఠా ఎక్కడి నుంచి వ‌చ్చింద‌నే కోణంలో విచారిస్తున్నారు.ఆ విష‌యం కాస్తా విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది.

#Kidnappe

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube