వైరల్‌ వీడియో : పిల్లలు స్మార్ట్‌ ఫోన్‌లకు ఎంతగా బానిస అయ్యారో అని చెప్పేందుకు చక్కని ఉదాహరణ

ప్రస్తుతం ప్రపంచాన్ని స్మార్ట్‌ ఫోన్‌లు ఏలేస్తున్న విషయం తెల్సిందే.స్మార్ట్‌ ఫోన్‌ల వల్ల అద్బుతమైన ప్రయోజనాలు ఉన్నాయి.

 Kid Glued To His Smartphone Walks Off With Wrong Parents-TeluguStop.com

వాటి వల్ల ఎన్నో పనులు చేతిలోనే పూర్తి అవుతున్నాయి.స్మార్ట్‌ ఫోన్‌ వల్ల రోజుల తరబడి జరగాల్సిన పనులు సైతం కొన్ని నిమిషాలు, గంటల్లో జరిగి పోతున్నాయి.

ఇంత వరకు బాగానే ఉంది.కాని స్మార్ట్‌ ఫోన్‌లకు పిల్లలు బానిసలుగా తయారు అవుతున్నారు.

ఎలాంటి స్మార్ట్‌ ఫోన్‌లు, ఇతర గాడ్జెట్స్‌ లేని సమయంలో పిల్లలు చాలా సంతోషంగా కుటుంబ సభ్యులతో నివాసం ఉండేవారు.కాని అనూహ్యంగా స్మార్ట్‌ ఫోన్‌లు ఎప్పుడు అయితే వచ్చాయో పిల్లలు బయట ప్రపంచంను చూడటం మానేశారు.

వైరల్‌ వీడియో : పిల్లలు స్మార్

గతంలో పిల్లలు బయట ఆడుకుంటూ కనిపించేవారు.కాని ఇప్పుడు పరిస్థితి అలా లేదు.స్కూల్‌ కు వెళ్లి వస్తే ఆ వెంటనే స్మార్ట్‌ ఫోన్‌ పట్టుకుని ఆడేసుకుంటున్నారు.అలా ఫోన్‌లో ఉన్న సమయంలో పిల్లలు లోకాన్నే మర్చి పోతున్నారు.కొందరు పిల్లలు ఫోన్‌ చూస్తూ తింటారు.అలా తింటూ ఎంత తిన్నామో, ఏం తిన్నామో, ఎందుకు తిన్నామో కూడా పట్టించుకోరు.

ఈమద్య కాలంలో ఈ పరిస్థితి మరీ ఎక్కువ అయ్యింది.దాంతో పిల్లల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పిల్లలు ఏ స్థాయిలో స్మార్ట్‌ ఫోన్‌కు అడిక్ట్‌ అయ్యారో అనే విషయం తెలియజేసేందుకు కింది వీడియో చక్కని ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

చైనాలో ఈ సంఘటన జరిగింది.ఒక రద్దీ ప్రాంతంలో ఒక బాలుడు తన తల్లిదండ్రితో తిరుగుతున్నాడు.అంత మందిలో కూడా అతడు తన చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ వాడటం లేదు.

తల్లి చేయి వదలకుండా పట్టుకున్న ఆ బాలుడు ఫోన్‌లో పడి తల్లి చేయిని వదిలేశాడు.ఆ వెంటనే మరో వ్యక్తి చేయిని పట్టుకున్నాడు.ఆ వ్యక్తి సరదాగా కొద్ది దూరం తీసుకు వెళ్లాడు.ఆ సంఘటనను ఇలా ఒక వ్యక్తి వీడియో తీశాడు.

ఫోన్‌లో లీనం అయ్యి ఉన్న ఆ కుర్రాడు కొద్ది దూరం వరకు అపరిచిత వ్యక్తితో నడిచాడు.కొద్ది సేపటి తర్వాత ఫోన్‌ నుండి మొహం బయటకు తీయడంతో తాను ఉన్నది మరో వ్యక్తితో అని తెలుసుకున్నాడు.

ఆ వ్యక్తిని చూసి ఒక్కసారిగా అవాక్కయిన ఆ బాలుడు చేయి వదిలేసి పరుగు పరుగున తల్లి చేయి పట్టుకున్నాడు.ప్రస్తుతం ఈ సంఘటన సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

పిల్లలు మరీ ఇంతగా సోషల్‌ మీడియా, ఫోన్‌కు బానిసైతే వారి జీవితాలు ఎలా అంటూ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఒక్క చైనా లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్తితి కొనసాగుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube