బిగ్ బాస్ హోస్ట్ గా తప్పుకొంటానన్నాను.. స్టార్ హీరో షాకింగ్ కామెంట్లు..?

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ హిందీ, తెలుగుతో పాటు, ఇతర భాషల్లో కూడా సక్సెస్ అయిన సంగతి తెలిసింది.హిందీలో సల్మాన్ ఖాన్, తెలుగులో కింగ్ నాగార్జున, మలయాళంలో మోహన్ లాల్, కన్నడలో కిచ్చా సుదీప్ బిగ్ బాస్ షోకు హోస్టులుగా వ్యవహరిస్తున్నారు.

 Kicha Sudeep Sensational Comments About Bigg Boss Show-TeluguStop.com

అయితే కన్నడ హోస్ట్ సుదీప్ బిగ్ బాస్ షో నుంచి హోస్ట్ గా త గతంలో తప్పుకోవాలని అనుకున్నారట.బిగ్ బాస్ షో కంటెస్టెంట్లతో పాటు సెలబ్రిటీలకు కూడా అదే స్థాయిలో పాపులారిటీని తెచ్చిపెట్టిన సంగతి తెలిసిందే.

బిగ్ బాస్ షో ద్వారా సెలబ్రిటీలు అభిమానించే ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యారు.కన్నడలో ఇప్పటివరకు ఏడు సీజన్లు ప్రసారం త్వరలో ఎనిమిదో సీజన్ ప్రారంభం కావాల్సి ఉంది.

 Kicha Sudeep Sensational Comments About Bigg Boss Show-బిగ్ బాస్ హోస్ట్ గా తప్పుకొంటానన్నాను.. స్టార్ హీరో షాకింగ్ కామెంట్లు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాజాగా సుదీప్ మీడియాతో బిగ్ బాస్ షో గురించి మాట్లాడుతూ చాలా భాషల్లో బిగ్ బాస్ షో హిట్టైందని ఇలాంటి షోకు తాను హోస్ట్ గా చేయగలనా ? చేయలేనా ? అనే సందేహం తనపై తనకే కలిగిందని ప్రేక్షకులు తాను బిగ్ బాస్ షోను హోస్ట్ చేస్తే ఎలా స్వీకరిస్తారనే భయం కూడా తనలో ఉండేదని అన్నారు.

బిగ్ బాస్ షో కోసం వారానికి రెండు రోజు కేటాయించడం అంత తేలిక కాదని బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ల మధ్య గొడవలు జరిగిన సందర్భాల్లో ఇబ్బంది పడ్డానని అన్నారు.

బిగ్ బాస్ సీజన్ 6 సమయంలో హోస్ట్ గా తప్పుకోవాలని తాను అనుకున్నా కలర్స్ ఛానెల్ హెడ్ బలవంతం చేయడంతో ఆ షోను ఒప్పుకోవాల్సి వచ్చిందని అలా బిగ్ బాస్ షోకు తాను హోస్ట్ గా కొనసాగుతున్నానని సుదీప్ అన్నారు.

ఈరోజు రాత్రి నుంచి కన్నడలో బిగ్ బాస్ సీజన్ 8 ప్రసారం కానుండగా కొంతమంది కంటెస్టెంట్ల పేర్లు లీక్ అయ్యాయి.

అయితే వైరల్ అవుతున్న పేర్లు నిజమో కాదో తెలియాలంటే ఈరోజు రాత్రి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఆగాల్సిందే.

#Bigg Boss 8 #Kicha Sudeep #Bigg Boss Show

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు