ప్రభాస్ 'ఆదిపురుష్' లో కన్నడ సూపర్ స్టార్ సుదీప్ !

ప్రభాస్ బాహుబలి చిత్రంతో తన స్టామినాను ఒక్కసారిగా పెంచుకున్నాడు.అందుకే వరస పెట్టి అన్ని పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు.

 Kiccha Sudeep In Prabhas Adipurush Movie-TeluguStop.com

ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్ సినిమాతో పాటు మరొక రెండు సినిమాల షూటింగ్ కూడా స్టార్ట్ చేసేసాడు.రాధే శ్యామ్ సినిమాలో ప్రభాస్ కు జంటగా పూజ హెగ్డే నటిస్తున్నారు.

దీంతో పాటు సలార్, ఆది పురుష్ సినిమాలు ప్రకటించి ఇప్పటికే షూటింగ్ కూడా ప్రారంభించేసారు.

 Kiccha Sudeep In Prabhas Adipurush Movie-ప్రభాస్ ఆదిపురుష్’ లో కన్నడ సూపర్ స్టార్ సుదీప్ -Gossips-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రభాస్ సలార్ సినిమాను కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు.

ప్రశాంత్ నీల్ ఈ సినిమాను ఉగ్రం సినిమాకు రీమేక్ గా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తుంది.

ఆదిపురుష్ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమా రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతుంది.

ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా నటిస్తున్నారు.

Telugu Adipurush, Adipurush Update, Ajay Devgan, Director Om Rout, Kiccha Sudeep, Kiccha Sudeep As Vibheeshana, Kiccha Sudeep In Adipurush, Kriti Sanon, Latest Update, Pan India Movie, Prabhas, Saif Ali Khan, Tollywood Film News-Latest News - Telugu

ఈ సినిమాను టి సిరీస్ సంస్థ 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుండగా 60 శాతం బడ్జెట్ గ్రాఫిక్స్ కోసమే ఉపయోగిస్తున్నారని సమాచారం.ఈ సినిమాను విజువల్ వండర్ గా తెరకెక్కిస్తున్నారు.అయితే ప్రస్తుతం ఈ సినిమాపై మరొక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది.

ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ కూడా నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.కిచ్చా సుదీప్ ఈ సినిమాలో కీరోల్ లో నటించబోతున్నట్టు లేటెస్ట్ బజ్ ఒకటి టాలీవుడ్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది.

ఈ సినిమాలో సుదీప్ రావణాసురుడి సోదరుడు విభీషణుడి పాత్రలో నటించ నున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.ఇది ఇలా ఉండగా ప్రస్తుతం ముంబై లో ఈ సినిమా కోసం స్పెషల్ గా వేసిన సెట్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది.ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి వచ్చే సంవత్సరం ఆగస్టు 11 న విడుదల చేయాలనీ చిత్ర యూనిట్ భావిస్తున్నారు.

#Prabhas #Kriti Sanon #Pan India Movie #Kiccha Sudeep #Adipurush

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు