సౌత్ లో మరొక సినిమాతో రాబోతున్న కియారా.. ఏ హీరోతోనో తెలుసా !

Kiara Exciting Announcement For South Movies, Kiara Advani, South Movies, NTR, Ram Charan,Kiara NTR Koratala Shiva Movie, Kiara To Romance With Ram Charan

సౌత్ ప్రేక్షకులకు బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ పరిచయం అవసరం లేని పేరు.టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమా ద్వారా తెలుగులోకి అడుగు పెట్టింది.

 Kiara Exciting Announcement For South Movies, Kiara Advani, South Movies, Ntr, R-TeluguStop.com

మొదటి సినిమాతోనే టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.తన అందం, నటన తో కుర్రకారు మనసును దోచుకుంది.

మొదటి సినిమాతోనే బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అందుకోవడంతో తన కెరీర్ ఒక్కసారిగా ఊపందుకుంది.
మహేష్ తో చేసిన సినిమా హిట్ అవ్వడంతో వెంటనే రామ్ చరణ్ తో వినయ విధేయ రామ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.

దీంతో ఈ బ్యూటీ టాలీవుడ్ లో స్టార్ స్టేటస్ అందుకుంది.కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అట్టర్ ప్లాప్ అవ్వడంతో ఈ అమ్మడు మళ్ళీ తెలుగులో నటించలేదు.

అయితే మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ కియారా పేరు టాలీవుడ్ లో మార్మోగిపోతోంది.

ఈ మధ్య రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు.అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా పేరు మొదటి నుండి వినిపిస్తుంది.కానీ ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటన అయితే రాలేదు.

అంతేకాదు ఈ సినిమాతో పాటు ఎన్టీఆర్ తో కూడా ఒక సినిమాలో చేయబోతున్నట్టు ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి.

ఎన్టీఆర్ కొరటాల శివతో ఒక సినిమా చేయబోతున్నట్టు ప్రకటించిన తర్వాత ఈ సినిమా హీరోయిన్ గురించి వార్తలు వస్తున్నాయి.ఈ సినిమాలో కూడా కియారా పేరు వినిపిస్తుంది.అయితే తాజాగా కియారా ఈ వార్తలపై స్పందించారు.

ఆమె సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ త్వరలోనే సౌత్ సినిమాల్లోకి మళ్ళీ వస్తునట్టు మెసేజ్ షేర్ చేసింది.దీంతో కియారా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube