వామ్మో.. కియారా అద్వానీ రెమ్యునరేషన్ అన్ని కోట్లా..?

భరత్ అనే అనేనువినయ విధేయ రామ సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన కియారా అద్వానీ పేరు గత కొన్ని రోజులుగా మారుమ్రోగుతున్న సంగతి తెలిసిందే.చరణ శంకర్ ప్రాజెక్ట్ తో పాటు ఎన్టీఆర్ కొరటాల శివ ప్రాజెక్ట్ లో కూడా కియారా అద్వానీనే ఫైనల్ అయినట్టు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది.

 Kiara Adwani Demands High Remuneration For Movie-TeluguStop.com

అయితే కియారా అద్వానీ రికార్డు స్థాయిలో రెమ్యునరేషన్ ను డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది.

కియారా అద్వానీ అడిగిన ఆమెను రెమ్యునరేషన్ చెల్లించలేక కొందరు టాలీవుడ్ నిర్మాతలు ఆమెకు బదులుగా మరో హీరోయిన్ కు ఛాన్స్ ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.ప్రస్తుతం కియారా అద్వానీ ఒక్కో సినిమాకు ఏకంగా రూ.2.5 కోట్ల రూపాయలు రెమ్యునరేష న్ డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది.కరోనా వల్ల నిర్మాతలకు సినిమా నిర్మాణం భారంగా మారింది.

 Kiara Adwani Demands High Remuneration For Movie-వామ్మో.. కియారా అద్వానీ రెమ్యునరేషన్ అన్ని కోట్లా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మళ్లీ థియేటర్లు ఎప్పుడు ప్రారంభమవుతాయో చెప్పలేని పరిస్థితి నెలకొంది.

థియేటర్లు ఓపెన్ అయినా మునుపటిలా ప్రేక్షకులు థియేటర్లలో సినిమాలు చూస్తారా ? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.శంకర్ చరణ్ ప్రాజెక్ట్ కోసం దిల్ రాజు కియారాను తీసుకోవాలని భావిస్తుండగా ఆమెనే ఎంపిక చేస్తారో లేదో చూడాల్సి ఉంది.మరోవైపు సినిమాసినిమాకు కియారా అద్వానీకి క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.

బాలీవుడ్ లో కియారా నటించిన సినిమాలలో ఎక్కువ సినిమాలు హిట్ అవుతున్నాయి.

కియారా అద్వానీ పాన్ ఇండియా హీరోయిన్ కావడంతో ఆమెను తీసుకుంటే సినిమాకు ప్లస్ అయ్యే అవకాశం ఉంది.

మరి భారీ మొత్తం పారితోషికం ఇచ్చి కియారా అద్వానీని తీసుకునే నిర్మాతలెవరో చూడాల్సి ఉంది.టాలీవుడ్ స్టార్ హీరోలు సైతం తమ సినిమాల్లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్లకు ఛాన్స్ ఇవ్వాలని భావిస్తున్నారు.

మరోవైపు టాలీవుడ్ హీరోయిన్లు బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లి అక్కడ సత్తా చాటుతుండటం గమనార్హం.

#Kiara Adwani #CharanShankar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు