గేమ్ ఛేంజర్ మూవీపై షాకింగ్ అప్ డేట్ ఇచ్చిన కియారా.. వేళ్లు వంకర పోయాయంటూ?

చరణ్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్( Game changer ) సినిమా ఎప్పుడు విడుదలవుతుందో క్లారిటీ లేకపోయినా ఈ సినిమాపై ఆకాశమే హద్దుగా అంచనాలు పెరుగుతున్నాయి.

దిల్ రాజు సైతం ఈ సినిమాను థియేటర్లలో ఆలస్యంగా రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

దిల్ రాజు బ్యానర్ లోని ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లలో గేమ్ ఛేంజర్ ఒకటి కావడం గమనార్హం.ఈ సినిమాలో కియారా అద్వానీ( kiara advani ) నటిస్తుండగా ఒక ఇంటర్వ్యూలో భాగంగా కియారా ఈ సినిమాకు సంబంధించి షాకింగ్ అప్ డేట్ ఇచ్చారు.

గేమ్ ఛేంజర్ సినిమా కోసం చాలా కష్టపడ్డానని నా వేళ్లు వంకర పోయాయని ఆమె చెప్పుకొచ్చారు.చరణ్ నాకు బెస్ట్ ఫ్రెండ్ అని కియారా అన్నారు.

డైరెక్టర్ శంకర్ ద్వారా ఎన్నో విషయాలను నేర్చుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు.ఈ సినిమాను చాలా బాగా డిజైన్ చేశారని కియారా వెల్లడించారు.

Kiara Adwani Comments About Game Changer Movie Details Here Goes Viral In Social
Advertisement
Kiara Adwani Comments About Game Changer Movie Details Here Goes Viral In Social

ఫ్యాన్స్ అంచనాలను మించి ఈ మూవీ ఉండనుందని కియారా అద్వానీ పేర్కొన్నారు.గేమ్ ఛేంజర్ సినిమా కోసం అహర్నిషలు కష్టపడ్డామని ఆమె అన్నారు.ఇప్పటికే రిలీజైన గేమ్ ఛేంజర్ ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో నటిస్తుండగా అంజలి( Anjali ) ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.చరణ్ అంజలి జోడీ ఎలా ఉండనుందో చూడాల్సి ఉంది.

Kiara Adwani Comments About Game Changer Movie Details Here Goes Viral In Social

రామ్ చరణ్ రేంజ్ పెరుగుతుండగా వేగంగా సినిమాల్లో నటించడంపై ఈ హీరో దృష్టి పెట్టాల్సి ఉంది.భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ లను ఎంచుకుని అదే సమయంలో ఈ సినిమాలతో చరణ్ బ్లాక్ బస్టర్ హిట్లను సాధించాల్సి ఉంది.చరణ్ హాలీవుడ్ ప్రాజెక్ట్ లలో నటిస్తే కెరీర్ పరంగా మేలు జరుగుతుందని చెప్పవచ్చు.

కియారా ఈ సినిమాకు 5 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నారని తెలుస్తోంది.

స్టార్ హీరో విజయ్ దేవరకొండ రికార్డును బ్రేక్ చేసిన నాని.. అసలేం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు