ఖచ్చితంగా చేస్తానంటోన్న వసుమతి

టాలీవుడ్‌లో హీరోయిన్‌గా అవకాశం లభించిన బ్యూటీలు ఆ తరువాత బాలీవుడ్‌కి వెళ్లి సెటిల్ అవ్వాలని చూస్తుంటారు.కానీ బాలీవుడ్ నుండి ఇక్కడికి వచ్చి సినిమాలు చేసే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది.

 Kiara Advani Waiting For Telugu Movie-TeluguStop.com

ఈ కోవలోకే చెందింది అందాల భామ కియారా అద్వానీ.బాలీవుడ్‌లో హీరోయిన్‌గా కెరీర్ మొదలుపెట్టిన ఈ బ్యూటీ టాలీవుడ్‌లోనూ నటించింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్రంలో హీరోయిన్ పాత్రలో నటించిన కియారా అద్వానీ టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది.ఈ సినిమాలో ఆమె నటించిన వసుమతి పాత్ర ఆమెకు మంచి పేరును తీసుకొచ్చింది.

ఈ సినిమా తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో వచ్చిన ‘వినయ విధేయ రామ’లో కూడా నటించింది.ఈ సినిమా తరువాత మరే ఇతర తెలుగు సినిమాలో కియారా కనిపించలేదు.

 Kiara Advani Waiting For Telugu Movie-ఖచ్చితంగా చేస్తానంటోన్న వసుమతి-Gossips-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బాలీవుడ్‌లో వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న ఈ బ్యూటీకి తెలుగులో నటించాలని ఉందట.కానీ బిజీ షెడ్యూల్స్ వల్ల అది కుదరడం లేదని, అవకాశం వచ్చినప్పుడు తప్పక తెలుగులో నటిస్తాని వసుమతి అంటోంది.

మరి ఈ బ్యూటీ తెలుగులో మళ్లీ ఎప్పుడు నటిస్తుందో చూడాలి అంటున్నారు ఆమె ఫ్యాన్స్.

#Ram Charan #VinayaVidheya #Bharat Ane Nenu #Kiara Advani #Mahesh Babu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు