మహేష్ బాబు సర్కారు వారి పాటకి హీరోయిన్ గా కియరా ఫైనల్  

Kiara Advani To Romance Mahesh Babu - Telugu Director Parasuram,, Sarkaru Vaari Paata Movie, Telugu Cinema, Tollywood

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురాం దర్శకత్వంలో నెక్స్ట్ సినిమాకిస సిద్ధం అయ్యాడు.ఫ్యామిలీ మాస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని పరశురాం డిజైన్ చేశాడు.

 Kiara Advani To Romance Mahesh Babu

ఇక తాజాగా ఈ సినిమాకి సర్కారువారి పాట అనే టైటిల్ కన్ఫర్మ్ చేశారు.షూటింగ్ లకి పర్మిషన్ ఇచ్చిన వెంటనే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి పరశురాం రెడీగా ఉన్నాడు.14 రీల్స్, మైత్రీ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమా కాస్టింగ్ గురించి ఎలాంటి సమాచారం బయటకి రాకపోయినా హీరోయిన్ విషయంలో ఒక స్పష్టత వచ్చినట్లు తెలుస్తుంది.

సూపర్ స్టార్ కి జోడీగా అంటే కచ్చితంగా హీరోయిన్ విషయంలో హైప్ ఉంటుంది.

మహేష్ బాబు సర్కారు వారి పాటకి హీరోయిన్ గా కియరా ఫైనల్-Movie-Telugu Tollywood Photo Image

ఈ నేపధ్యంలో పరశురాం ఈ సినిమా కోసం చాలా మంది భామలని ప్రయత్నించాడు.

కీర్తి సురేష్ పేరు కూడా ప్రముఖంగా వినిపించింది.అయితే మొదటి నుంచి ఎక్కువగా కీయరా అద్వానీ పేరు వినిపిస్తూ వచ్చింది.

ఇప్పటికే కీయరా భరత్ అనే నేను సినిమాలో మహేష్ కి జోడీగా నటించింది.ఇక తాజాగా వినిపిస్తున్న మాటల బట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా కియరా ఫైనల్ అయినట్లు తెలుస్తుంది.

ఇప్పటికే బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలతో జోరు మీద ఉన్న కీయరా నే పరశురాం, మహేష్ కన్ఫర్మ్ చేసినట్లు సమాచారం.ఈ రోజు సినిమా టైటిల్ ప్రకటించిన నేపధ్యంలో త్వరలో అధికారికంగా హీరోయిన్ విషయం కూడా స్పష్టం చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.

మరి ఇప్పటికే క్లాస్ యాంగిల్ లో ఈ కాంబినేషన్ ని తెరపై చూసిన ప్రేక్షకులు ఈ సారి మాస్ యాంగిల్ లో చూడబోతున్నారు అని తెలుస్తుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Kiara Advani To Romance Mahesh Babu Related Telugu News,Photos/Pics,Images..

footer-test