డేటింగ్ చెయ్యడం తప్పు కాదంటున్న మహేష్ హీరోయిన్...  

Kiara Advani Sensational Comments On Open Relationship-kiara Advani Comments,kiara Advani Latest Movie News,kiara Advani Movie News,kiara Advani News,tollywood Actress Kiara Advani

తెలుగులో భరత్ అనే నేను చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ఆడి పాడినటువంటి ముద్దుగుమ్మ కియారా అద్వానీ గురించి తెలియని వారు ఉండరు.వచ్చీరావడంతోనే సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించే అవకాశం దక్కించుకొని ఆ తరువాత మెగా పవర్ స్టార్  రామ్ చరణ్ తేజ్ సరసన వినయ విధేయ రామ చిత్రంలో నటించి ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది కియారా.

Kiara Advani Sensational Comments On Open Relationship-Kiara Kiara Latest Movie News Tollywood Actress

అయితే తాజాగా కియారా అద్వానీ ఓ ప్రముఖ ఫోటోషూట్ సంస్థ నిర్వహించినటువంటి ఫోటో షూట్ కార్యక్రమంలో పాల్గొంది.

ఇందులో భాగంగా పెళ్లికూతురు దుస్తులలో దిగిన ఫోటోలకు నెటిజన్లు ఫిదా అయిపోయారు.

 అయితే ఈ ఫోటోషూట్ కార్యక్రమం అనంతరం కియారా అద్వానీ పత్రికా విలేకరులతో మాట్లాడుతూ ఓపెన్ రిలేషన్ షిప్ పై పలు సంచలన వ్యాఖ్యలు చేసింది.ఇందులో భాగంగా ప్రేమలో పడి పెళ్లి చేసుకోవాలని అనుకునేవాళ్ళు డేటింగ్ చేయడంలో తప్పులేదని అంటోంది ఈ అమ్మడు.

అంతేగాక తాను ప్రస్తుతం ఎవరితోనూ రిలేషన్ లో లేనని ఒకవేళ ఎవరితోనైనా రిలేషన్ లో ఉంటే గనుక ఆ బంధం గురించి మాట్లాడడానికి అసలు భయపడనని తెగేసి చెప్పింది కియారా అద్వానీ.అంతేకాక భార్యాభర్తల బంధం అనేది చాలా పవిత్రమైందని దాన్ని గట్టుగానో మరియు ఎవరికో తెలిస్తే బంధం విడిపోతుందనే  భయంతో  ఉండకూడదని, ఒకవేళ అలాంటి బంధాలే ఉంటే అవి కలకాలం నిలబడవని అన్నారు.

అయితే ఇది ఇలా ఉండగా ప్రస్తుతం కియారా అద్వానీ టాలీవుడ్ లో విలక్షణ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నటువంటి ఓ చిత్రంలో నటిస్తోంది.ఈ చిత్రంలో హీరోగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్నాడు.

ఈ చిత్రం తొందర్లోనే పట్టాలెక్కనుంది.

తాజా వార్తలు

Kiara Advani Sensational Comments On Open Relationship-kiara Advani Comments,kiara Advani Latest Movie News,kiara Advani Movie News,kiara Advani News,tollywood Actress Kiara Advani Related....