కత్రినా పెళ్లి గురించి మాట్లాడిన కియారా.. నన్ను పెళ్ళికి పిలవలేదంటూ..!

Kiara Advani Says She Didnt Get An Invite To Vicky Kaushal Katrina Kaifs Wedding

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ తన ప్రియుడు విక్కీ కౌశల్ ఎప్పటి నుండో డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే.ఇక ఇన్ని రోజులకు ఈ బాలీవుడ్ లవ్ బర్డ్స్ పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధం అవుతున్నారని గత కొద్దీ రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.

 Kiara Advani Says She Didnt Get An Invite To Vicky Kaushal Katrina Kaifs Wedding-TeluguStop.com

వీరిద్దరూ డిసెంబర్ 9న వివాహం చేసుకుంటున్నట్టు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది.

కత్రినా కైఫ్ తన ప్రియుడు విక్కీ కౌశల్ వివాహం చేసుకోబోతున్న విషయం అధికారికంగా ప్రకటన రాకపోయినా మీడియా మాత్రం డిసెంబర్ లో పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం చేస్తుంది.

 Kiara Advani Says She Didnt Get An Invite To Vicky Kaushal Katrina Kaifs Wedding-కత్రినా పెళ్లి గురించి మాట్లాడిన కియారా.. నన్ను పెళ్ళికి పిలవలేదంటూ..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రాజస్థాన్ లోని సవాయ్ మధోపూర్ జిల్లా లోని 1వ శతాబ్దపు ప్యాలెస్ సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారా లో ఈ వివాహ వేడుక చేసుకుంటున్నారని టాక్ అయితే బయటకు వచ్చింది.

అయితే ఇన్ని వార్తలు బయటకు వస్తున్న కూడా వీరిద్దరూ మాత్రం నోరు తెరవకపోవడం వల్ల ఏ విషయం స్పష్టంగా తెలియడం లేదు.

ఇక తాజాగా వీరిద్దరి పెళ్లి వార్తపై కియారా అద్వానీ స్పందించారు.

Telugu Katrina Vicky, Katrinavicky, Katrina Kaif, Kiara Advani, Kiaraadvani, Senses Fort, Tiger, Vicky Kaushal-Movie

నిన్న ఢీల్లీలో జరిగిన ఒక కార్యక్రమానికి కియారా అద్వానీ హాజరయ్యారు.ఈ సందర్భంగా మీడియాతో ఆమె మాట్లాడారు.అక్కడ మీడియా కత్రినా, విక్కీ కౌశల్ పెళ్లి గురించి అడిగారు.

Telugu Katrina Vicky, Katrinavicky, Katrina Kaif, Kiara Advani, Kiaraadvani, Senses Fort, Tiger, Vicky Kaushal-Movie

ఆ విషయంపై కియారా స్పందిస్తూ… ”నిజంగానే.? వాళ్ళ పెళ్లి గురించిన వార్తలు నేను కూడా విన్నాను.కానీ నాకేం తెలియదు.నన్నైతే వాళ్ళ పెళ్ళికి ఇప్పటి వరకు పిలువలేదు.” అని చెప్పడంతో అందరు మళ్ళీ ఆలోచనలో పడ్డారు.ఇప్పటి వరకు బాలీవుడ్ లో ఒక్కరికి కూడా ఆహ్వానం అందలేదని తెలుస్తుంది.

మరి వీరిద్దరిలో ఎవరో ఒకరు నోరు విప్పి చెప్తే కానీ ఏ విషయం బయటకు రాదు.

#Katrina Vicky #Vicky Kaushal #Senses Fort #KiaraAdvani #Kiara Advani

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube