కెమెరాకు దొరికిపోయిన కియారా అద్వానీ.. ఏం జరిగిందంటే..?

తెలుగులో భరత్ అనే నేను, వినయ విధేయ రామ సినిమాల్లో నటించి నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు కియారా అద్వానీ.భరత్ అనే నేను బ్లాక్ బస్టర్ హిట్ అయినా వినయ విధేయ రామ డిజాస్టర్ కావడంతో కియారాకు తెలుగులో అవకాశాలు తగ్గాయి.

 Kiara Advani Meet Rumoured Boy Friend Siddarth Malhotra-TeluguStop.com

అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం వరుస అవకాశాలతో కియారా అద్వానీ బిజీగా ఉండటం గమనార్హం.ఒక సందర్భంలో తాను చిన్నప్పుడే ప్రేమలో పడ్డానని కానీ చదువుపై దృష్టి పెట్టడం కోసం ప్రేమకు దూరమయ్యాయని కియారా చెప్పిన సంగతి తెలిసిందే.

అయితే ఏడాది కాలం నుంచి కియారా అద్వానీ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాతో ప్రేమలో ఉన్నారని జోరుగా ప్రచారం జరిగింది.అయితే అటు సిద్దార్థ కానీ ఇటు కియారా కానీ ప్రేమ వార్తల గురించి స్పందించలేదు.

 Kiara Advani Meet Rumoured Boy Friend Siddarth Malhotra-కెమెరాకు దొరికిపోయిన కియారా అద్వానీ.. ఏం జరిగిందంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే తాజాగా బాంద్రాలో ఉన్న సిద్దార్థ్ ఇంటికి వెళుతూ కియారా కనిపించగా నెటిజన్లు ఫోటోలు తీసి ఆ ఫోటోలను షేర్ చేశారు.దీంతో బాయ్ ఫ్రెండ్ ఇంటికి వెళుతూ కియారా కెమెరా కంటికి చిక్కి దొరికిపోయిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

సిద్దార్థ్ మల్హోత్రా ఇంటికి వెళ్లిన కియారా డిన్నర్ చేసి వెంటనే తిరిగి వచ్చారు.సిద్దార్థ్, కియారా షేర్షా మూవీలో కలిసి నటించగా ఆ సినిమా షూటింగ్ సమయంలోనే వీళ్లిద్దరూ ప్రేమలో పడ్డారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.గత నెలలో కియారా, సిద్దార్థ్ మాల్దీవులకు వెళుతూ మీడియాకు చిక్కిన సంగతి తెలిసిందే.కియారా మళ్లీ ప్రేమలో పడితే ఆ విషయాలను ఎందుకు బయటపెట్టడం లేదని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
షేర్షా సినిమా 2020 సంవత్సరం జులై 3వ తేదీన విడుదల కావాల్సి ఉండగా కరోనా విజృంభణ వల్ల లాక్ డౌన్ నిబంధనలు అమలు కావడంతో ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది.ఈ సినిమాకు కరణ్ జోహార్ కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తుండగా విష్ణువర్ధన్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.

#Social Media #Kiara Adwani #Karan Johar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు