రామ్ చరణ్ తో మరోసారి నటించడానికి రెడీ అయిన బ్యూటీ..!

సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఒక సినిమా చేస్తున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంది.

 Kiara Advani In Ram Charan And Shankar Project, Ram Charan, Kiara Advani, Direct-TeluguStop.com

ప్రస్తుతం శంకర్ ఇండియన్ 2 సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు.రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడు.

అయితే ఈ సినిమాపై ప్రస్తుతం మరొక గాసిప్ వినిపిస్తుంది.

ఈ సినిమాలో నటించే హీరోయిన్ గురించి ఒక గాసిప్ వినపడుతుంది.

ఇంతకు ముందు కొరియన్ బ్యూటీ ని తీసుకోబోతున్నారని ప్రచారం జరిగింది.అయితే ఇప్పుడు మరొకరి పేరు వినిపిస్తుంది.

రామ్ చరణ్ కు జోడీగా కియారా అద్వానీ ని తీసుకోబోతున్నారని సమాచారం.ఇప్పటికే వీళ్లిద్దరు వినయ విధేయ రామ సినిమాలో కలిసి నటించారు.

సినిమా హిట్ అవ్వకపోయిన వీళ్లిద్దరి జోడీకి మంచి మార్కులే పడ్డాయి.

అయితే ఇప్పటికే చిత్ర యూనిట్ కియారా ను సంప్రదించారని ఆమె ఈ సినిమా చేయడానికి అంగీకరించిందని సమాచారం.

ఈ సినిమాలో కియారా రిపోర్టర్ పాత్రలో నటించబోతుందని టాక్.ఈ సినిమాను భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మిస్తున్నాడు.ఈ సినిమా కూడా పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతుంది.ఈ సినిమా జూన్ నుండి సెట్స్ మీదకు వెళ్లబోతుందని ఇప్పటికే గాసిప్స్ అయితే వచ్చాయి.

కానీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

Telugu Gossips, Kiara Advani, Kiaraadvani, Ram Charan, Tollywood-Latest News - T

ప్రస్తుతం రామ్ చరణ్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమాలో రామ్ చరణ్ తో పాటు ఎన్టీఆర్ కూడా నటిస్తున్నాడు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

ఇప్పటికే ఈ సినిమా 80 శాతం పూర్తి చేసుకుంది.ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తుంటే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు.

ఈ సినిమా అక్టోబర్ 13 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube