యంగ్ టైగర్ ఎన్టీఆర్ RRR సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో తన తదుపరి చిత్రంపై పూర్తి దృష్టిసారించారు.ఈ క్రమంలోనే కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ తన 30వ చిత్రాన్ని చేయబోతున్నారు.
ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కడంతో ఈ సినిమా కోసం ఎన్టీఆర్ పూర్తిగా తన లుక్ మార్చుకోవడానికి ఎంతో కష్ట పడుతున్నారు.ఇక ప్రస్తుతం కొరటాల శివ ఆచార్య సినిమా విడుదల కావడంతో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు.
ఈ సినిమా విడుదలైన అనంతరం ఎన్టీఆర్ సినిమా ప్రారంభమవుతుంది.
ఇకపోతే ఎన్టీఆర్ తన 30 వ చిత్రంలో హీరోయిన్ గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
ఈ క్రమంలోనే మొదట్లో ఈ సినిమాలో తారక్ సరసన అలియా నటిస్తుందని వార్తలు వచ్చాయి.అయితే అలియా పెళ్లి చేసుకోవడంతో అలియా స్థానంలో రష్మిక నటిస్తుందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి.
అయితే తాజాగా ఈ సినిమా విషయంలో మరొక హీరోయిన్ పేరు వినబడుతుంది.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించడం కోసం కొరటాల శివ తన పాత హీరోయిన్ ని తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

ఈ క్రమంలోనే కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన భరత్ అనే నేను సినిమా ద్వారా పరిచయమైన హీరోయిన్ కియారా అద్వానీను ఎన్టీఆర్ చిత్రంలో హీరోయిన్ గా తీసుకోవాలనే ఆలోచనలో కొరటాల ఉన్నట్లు తెలుస్తోంది.కియారా తనకు ముందు నుంచి తెలిసిన అమ్మాయి కావడం, అలాగే మంచి నటి కూడా కావడంతో ఈమెను తన తదుపరి చిత్రంలో తీసుకోవడానికి కొరటాల ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.







