ఎన్టీఆర్ మూవీలో రష్మికకు అందుకే ఛాన్స్ రాలేదా..?  

టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.మార్చి నెల నాటికి ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి కానుందని అనంతరం త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా షూటింగ్ లో ఎన్టీఆర్ పాల్గొననున్నారని సమాచారం.

TeluguStop.com - Kiara Advani Finalized For Ntr Trivikram Combination Movie

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులను త్రివిక్రమ్ పూర్తి చేశారు.
చాలాకాలం నుంచి వినిపిస్తున్నట్లుగానే ఈ సినిమాలో కియారా అద్వానీ ఫైనలైజ్ అయిందని తెలుస్తోంది.

అయితే మొదటి నుంచి కియారా అద్వానీ పేరుతో పాటు రష్మిక మందన్న పేరు కూడా వినిపించినా కియారానే త్రివిక్రమ్ ఫైనలైజ్ చేయడానికి అసలు కారణం వేరే ఉందని సమాచారం.తెలుగులో భరత్ అనే నేను, వినయ విధేయ రామ సినిమాల్లో నటించిన కియారాకు నటిగా టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో మంచి గుర్తింపు ఉంది.

TeluguStop.com - ఎన్టీఆర్ మూవీలో రష్మికకు అందుకే ఛాన్స్ రాలేదా..-Gossips-Telugu Tollywood Photo Image

ఆర్ఆర్ఆర్ సినిమాతో వచ్చే క్రేజ్ వల్ల తారక్ హీరోగా తెరకెక్కే సినిమాలపై బాలీవుడ్ ఫ్యాన్స్ సైతం ఆసక్తి చూపించే అవకాశం ఉంది.ప్రభాస్ కు బాహుబలి సిరీస్ సినిమాలతో వచ్చిన క్రేజ్ వల్లే సాహో సినిమాకు డిజాస్టర్ టాక్ వచ్చినా బాలీవుడ్ లో అంచనాలకు అందని స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి.అందువల్ల బాలీవుడ్ లో గుర్తింపు ఉన్న కియారాను ఎంపిక చేసుకుంటే సినిమాకు ప్లస్ అవుతుందని త్రివిక్రమ్ శ్రీనివాస్ భావించారని సమాచారం.

ఈ కారణాల వల్లే రష్మికకు ఈ సినిమాలో ఛాన్స్ మిస్ అయిందని తెలుస్తోంది.అయితే కియారా అద్వానీని ఫైనల్ చేసినా ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.త్రివిక్రమ్ ఈ సినిమాలో ఎన్టీఆర్ ను రాజకీయ నాయకుడు గా చూపించబోతున్నారని సమాచారం.

అరవింద సమేత వీర రాఘవ సినిమాతో బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అని ప్రూవ్ చేసుకున్న ఎన్టీఆర్ త్రివిక్రమ్ ఈ సినిమాతో అంతకు మించిన సక్సెస్ ను సొంతం చేసుకోవాలని భావిస్తున్నారు.

#NtrTrivikram #Kiara Adwani #RashmikaOut #Rashmika #Kiara With Ntr

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు