షోరూమ్ లోనే గోడకు గుద్ది ఓపెనింగ్ చేసిన వ్యక్తికి పాత కార్ ప్లేస్ లో కొత్త‌ది ఇచ్చిన కియా మోటర్స్..!

కొద్ది రోజుల క్రితం ఓ కొత్త కారును షోరూం నుండి బయటికి తీసుకు వచ్చే సమయంలో 30 లక్షల కారును డైరెక్టుగా గోడకు గుద్దిన సంగతి అందరికీ గుర్తు ఉండే ఉంటుంది.అయితే ఆ సంఘటన ఇప్పుడు ఎందుకని అనుకుంటున్నారా…? అవును పాపం 30 లక్షలు పెట్టి కొన్న కారు ఒక్క రౌండ్ కూడా వేయకుండానే పూర్తిగా ధ్వంసం కావడం నిజంగా దురదృష్టమే.అయితే ఆవ్యక్తికి కియా కంపెనీ ఆ కార్ ప్లేస్ లో మరో కొత్త కారును ఇచ్చినట్టు సమాచారం.

 Car Gift, Kia Motors, Insurance-TeluguStop.com

ఇకపోతే కారు నడుపుతున్న సమయంలో సదరు వ్యక్తికి మాన్యువల్ డ్రైవింగ్ కారు నడపడం మాత్రమే అవగాహన ఉన్న ఆ వ్యక్తికి ఆటోమేటిక్ కార్ డ్రైవింగ్ పై అవగాహన లేకపోవడంతో ఆ తొందర పొరపాటు జరిగిపోయింది.

అయితే ఇందులో కూడా తన అదృష్టం ఏమిటంటే ఆ కారుకు ఇన్సూరెన్స్ ఉండడంతో సదరు కారు ఓనర్ బతికిపోయాడు.ఇప్పుడు ఆ కారు ఇన్సూరెన్స్ అతనిని కాపాడింది.

ఇప్పుడు ఆ కారుకు సంబంధించిన ఇన్సూరెన్స్ మొత్తం క్లైమ్ జరిగిందట.

కాబట్టి ఆ గుద్దుకున్న కార్ స్థానంలో కియా కంపెనీ మరో కొత్త కార్ ఇచ్చిందని సమాచారం.

అయితే కొత్త కారు కొన్న సమయం ఎంతో తీపి జ్ఞాపకంగా ఉండాల్సిన సమయంలో ఆ ఓనర్ కు మాత్రం చాలా చేదు జ్ఞాపకంగా మిగిలింది.అయితే ఎట్టకేలకు ఆ కారు ఓనర్ ఊపిరి తీసుకున్నట్టు అయింది.

అయితే ఇంత పెద్ద మొత్తం ఇన్సూరెన్స్ తొందరగానే క్లైమ్ జరిగినట్టుంది కాబోలు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube