హీరోయిన్ గా ఎంట్రీ కోసం ఖుషీ కపూర్ వెయిటింగ్... క్లారిటీ ఇచ్చిన తండ్రి

అతిలోక సుందరి శ్రీదేవి ప్రస్తానం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఏ స్థాయిలో సాగిందో అందరికి తెలిసిందే.ఆమె ఇండియన్ సినిమా క్వీన్ గా ఏకంగా రెండు దశాబ్దాల పాటు హీరోయిన్ గా తన హవాని కొనసాగించింది.

 Khushi Kapoor Will Make Her Bollywood Debut, Tollywood- Jhanvi Kapoor-boni Kapoo-TeluguStop.com

నిర్మాత బోనీ కపూర్ ని పెళ్లి చేసుకున్న తర్వాత కొంత కాలం సినిమాలకి దూరమైనా ఇద్దరు కూతుళ్లు పెద్దవాళ్ళు అయిన తర్వాత మరల నటిగా రీ ఎంట్రీ ఇచ్చి మంచి సినిమాలు చేసింది.అయితే అర్ధాంతరంగా ఆమె తనువు చాలించింది.

అయితే శ్రీదేవి చనిపోయే సమయానికి పెద్ద కూతురు జాన్వీ హీరోయిన్ గా తడక్ అనే సినిమా చేస్తుంది.కూతురు నటనని తెరపై చూసుకోవాలని అనుకున్న శ్రీదేవి కోరిక తీరకుండానే చనిపోయింది.

ఇక జూనియర్ అతిలోక సుందరి అనిపించుకున్న జాన్వీ కపూర్ ఇప్పటికే హీరోయిన్ గా సక్సెస్ అయ్యి వరుస సినిమా అవకాశాలని అందుకుంటుంది.ప్రస్తుతం ఆమె చేతిలో రెండు పెద్ద సినిమాలు ఉన్నాయి.

జాన్వీ కపూర్ ని కరణ్ జోహార్ హీరోయిన్ గా పరిచయం చేశాడు.

Telugu Actress Sridevi, Bollywood Debut, Boni Kapoor, Indian, Jhanvi Kapoor, Khu

ఇక అక్క బాటలోనే ప్రయాణం చేస్తూ శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి ఎదురుచూస్తుంది.ఇప్పటికే నటనలో శిక్షణ తీసుకున్న ఈ భామ దర్శక, నిర్మాతల దృష్టిలో పడటానికి ఫోటోషూట్స్ కూడా స్టార్ట్ చేసింది.తన ఇన్స్టాగ్రామ్ లో హాట్ హాట్ సోయగాలతో అందరికి వలవిసిరే ప్రయత్నం చేస్తుంది.

ఇదిలా ఉంటే ఖుషీ కపూర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తండ్రి బోనీ కపూర్ కూడా కన్ఫర్మ్ చేశారు.తాజా ఇంటర్వ్యూలో ఖుషీ నట వృత్తిని కొనసాగించడానికి ఆసక్తి చూపుతున్నట్లు బోనీ వెల్లడించారు.

మీరు త్వరలో ఒక ప్రకటన వింటారు అంటూ స్పష్టం చేశారు.

తాను ఖుషీని లాంచ్ చేయబోనని బోనీ కపూర్ స్పష్టం చేశారు.

ఖుషీ గ్రాండ్ లాంచ్ మరో ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ చేస్తుందని అన్నారు.నాకు వనరులు ఉన్నాయి.

కాని నేను వేరొకరు ఆమెను ప్రారంభించాలనుకుంటున్నాను.ఎందుకంటే నేను ఆమె తండ్రిని.

నిర్మాతగా నేను పరిచయం చేయడం నచ్చదు.అలాగే తనకు కూడా మంచిది కాదు అని చెప్పుకొచ్చారు.

ఇలాంటి స్టార్ కిడ్స్ ని తెరకి పరిచయం చేయడానికి బాలీవుడ్ లో కరణ్ జోహార్ ఎలాగూ ఉన్నాడు కాబట్టి బోనీ కపూర్ చిన్న కూతురు విషయంలో కూడా ఎలాంటి టెన్షన్ లేకుండా ఉన్నాడని బాలీవుడ్ లో చెప్పుకుంటున్నారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube