పవన్ అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఈసారి బ్లాక్ బస్టర్‌ తీస్తా

పవన్‌ కళ్యాణ్‌ కెరీర్‌ లో మొదటి బిగ్గెస్ట్‌ సూపర్‌ హిట్‌ ఏది అంటే ఖుషి అంటూ ప్రతి ఒక్కరు చెబుతారు.ఇప్పటికి ఆ సినిమా గురించిన చర్చ జరుగుతూనే ఉంటుంది.

 Khushi Director S J Surya Want Ot Direct Pawan Kalyan , Kushi , Pawan Kalyan,  T-TeluguStop.com

ఆ సినిమా లో పవన్‌ కళ్యాన్‌ బాడీ లాంగ్వేజ్ హీరోయిన్‌ తో ప్రేమ డైలాగ్స్ లవ్‌ స్టోరీ ఇలా ప్రతి ఒక్కటి కూడా సినిమా ఇప్పటికి ఫ్రెష్ గా ఉండేలా చేసింది అనడంలో సందేహం లేదు.పవన్ కళ్యాణ్‌ కెరీర్‌ లో ఏడవ సినిమా అయిన ఖుషి విడుదల అయ్యి 20 ఏళ్లు పూర్తి అయ్యింది.

ఈ సందర్బంగా పవన్‌ అభిమానులు నెట్టింట చేసిన సందడి అంతా ఇంతా కాదు.ప్రముఖ స్టార్స్‌ కూడా ఖుషికి అభిమానులు అనడంలో సందేహం లేదు.

అంతటి అద్బుతంను ఆవిష్కరించింది దర్శకుడు ఎస్‌ జే సూర్య.ఆయన దర్శకత్వం లో పవన్‌ మళ్లీ కొమరం పులి సినిమా ను చేశాడు.ఆ సినిమా డిజాస్టర్‌ గా నిలిచింది.

ఖుషి 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా దర్శకుడు ఎస్ జే సూర్య మాట్లాడుతూ కెరీర్‌ లో ఇప్పటి వరకు తనకు బిగ్గెస్ట్‌ సక్సెస్‌ అంటే ఖుషి అన్నాడు.

తమిళం, తెలుగు మరియు హిందీల్లో ఖుషి సినిమా ను ఎస్‌ జే సూర్య తెరకెక్కించాడు.తెలుగు లో హిట్ అయినంతగా ఇతర భాషల్లో హిట్ అవ్వలేదు.తెలుగు లో నిలిచి పోయే సినిమా గా ఖుషి నిలిచినందుకు సంతోషం అంటూ ఎస్‌ జే సూర్య చెప్పుకొచ్చాడు.ఇంకా ఎస్ జే సూర్య మాట్లాడుతూ పవన్‌ కళ్యాణ్‌ గారు మళ్లీ అవకాశం ఇస్తే తప్పకుండా మరో బ్లాక్ బస్టర్ ను చేస్తానంటూ ధీమా వ్యక్తం చేశాడు.

నటుడిగా కొనసాగుతున్న సూర్య ఈమద్య కాలంలో దర్శకత్వం జోలికి వెళ్లడం లేదు.కాని పవన్‌ ఆఫర్‌ ఇస్తే తప్పకుండా ఒక అద్బుత సినిమా ను చేస్తానంటున్నాడు.

మరి పవన్‌ నుండి ఆఫర్ వస్తుందా అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube