సౌత్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి కుష్బూ( Khushboo )ఒకరు.ఈమె తెలుగు తమిళ భాష చిత్రాలలో స్టార్ హీరోలు అందరి సరసన నటించారు .ఇలా ఒకప్పుడు వరుస సినిమాలలో నటించిన ఈమె ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ కూడా ప్రారంభించారు.ఇప్పటికీ యంగ్ హీరోల సినిమాలలో తల్లి పాత్రలలో పోషిస్తూ ఈమె కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.
అలాగే రాజకీయాలలో కూడా కుష్బూ కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే.ఇదిలా ఉండగా తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈమె బాలీవుడ్ చిత్రం యానిమల్ ( Animal ) సినిమా గురించి మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
సందీప్ రెడ్డి ( Sandeep Reddy ) దర్శకత్వంలో రణబీర్ కపూర్( Ranbir Kapoor ) రష్మిక (Rashmika) నటించిన ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకుంది.అయితే ఈ సినిమా గురించి కుష్బూ మాట్లాడుతూ ఇలాంటి సినిమాని ప్రేక్షకులు ఎలా సక్సెస్ చేసారో తనకు అర్థం కావడం లేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.యానిమల్ లాంటి ఒక సినిమాని ప్రేక్షకులు అంత పెద్ద సక్సెస్ ఎలా చేశారో తనకు ఇప్పటికీ ఆశ్చర్యం కలుగుతుందని తెలిపారు.
ప్రజల మనస్తత్వాలు ఈ రకంగా ఉన్నాయని తెలిసి చాలా షాకింగ్ గా ఉందని ఈమె తెలిపారు.జనాలకు ఈ విధమైనటువంటి మనస్తత్వం ఉండటం ఎప్పటికైనా సమస్యగానే మారుతుందని ఈమె తెలిపారు.ఎందుకంటే సినిమాలలో చూపించిన విధంగానే బయట జరుగుతున్నాయని ఇలాంటి సినిమాలు సమాజానికి మంచిది కాదంటూ కుష్బూ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
అయితే ఈ సినిమా గురించి ఇప్పటికే ఎంతోమంది తీవ్రస్థాయిలో విమర్శలు కురిపించిన సంగతి తెలిసిందే.