హాట్ కేకులా జరిగిన ఖిలాడీ బిజినెస్.. ట్వీట్ తో తెలిపిన డైరెక్టర్!

కరోనా తర్వాత రవితేజ మళ్ళీ మునుపటిలా మారిపోయాడు.ఈ కరోనా క్రైసిస్ లో కూడా మాస్ రాజా క్రాక్ తో సూపర్ హిట్ కొట్టి మరింత జోష్ లో ఉన్నాడు.

 Khiladi Rights Sold For A Record Price , Khiladi On February ,khiladi Release Date, Ravi Teja , Khiladi , Ramesh Varma , Dimple Hatiya , Minakshi Chowdary-TeluguStop.com

ప్రసెంట్ రవితేజ చేస్తున్న కొత్త చిత్రాల్లో ‘ఖిలాడీ’ ఒకటి.రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడీ సినిమా తెరకెక్కుతుంది.

ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్, టీజర్స్,పాటలు అన్ని కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

 Khiladi Rights Sold For A Record Price , Khiladi On February ,Khiladi Release Date, Ravi Teja , Khiladi , Ramesh Varma , Dimple Hatiya , Minakshi Chowdary-హాట్ కేకులా జరిగిన ఖిలాడీ బిజినెస్.. ట్వీట్ తో తెలిపిన డైరెక్టర్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకుంది.

కానీ కరోనా ఈ సినిమా విడుదలకు అడ్డంకిగా మారింది.దీంతో గత ఏడాది విడుదల చేయడానికి కుదరలేదు.

దీంతో ఈ ఏడాది రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.ఈ సినిమాను ఫిబ్రవరి 11న విడుదల చేస్తున్నట్టు సోషల్ మీడియాలో ఒక పోస్టర్ ద్వారా ఈ విషయాన్నీ తెలిపారు.

ఇక ఈ సినిమా బిజినెస్ గురించి డైరెక్టర్ రమేష్ వర్మ తాజాగా సోషల్ మీడియాలో ఒక విషయాన్నీ తెలిపారు.

రమేష్ వర్మ ఈ సినిమా బిజినెస్ హాట్ కేకులా కరిగిందని ట్వీట్ ద్వారా తెలిపారు.ట్రేడ్ వర్గాలు చెబుతున్న ప్రకారం నైజం లో 9 కోట్లు, ఆంధ్రాలో 11 కోట్ల రూపాయలు, సీడెడ్ లో 3.6 కోట్ల బిజినెస్ జరిగినట్టు చెబుతున్నారు.ఇక హిందీలో ఈ సినిమాను నిర్మాణ భాగస్వామి అయినా పెన్ స్టూడియోస్ విడుదల చేయబోతుంది.ఈ థియేట్రికల్ రైట్స్ తో పాటు ఓవర్ ఆల్ గా ఇండియా లోను, ఓవర్శిస్ లోను ఎంత బిజినెస్ జరిగిందో బయటకు రావాల్సి ఉంది.

ఇంకా శాటిలైట్స్, ఓటిటి రైట్స్ అదనం.ఇలా ఖిలాడీ సినిమా బిజినెస్ గట్టిగానే జరిగినట్టు తెలుస్తుంది.

Video : Khiladi Rights Sold For A Record Price , Khiladi On February ,Khiladi Release Date, Ravi Teja , Khiladi , Ramesh Varma , Dimple Hatiya , Minakshi Chowdary

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube