ఖిలాడీ రివ్యూ అండ్ రేటింగ్…

డైరెక్టర్ రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా మీనాక్షి చౌదరి డింపుల్ హాయతి హీరోయిన్లుగా నటించిన చిత్రం ఖిలాడీ.ఈ సినిమాలో సీనియర్ నటులు అర్జున్, ఉన్ని ముకుందన్, వెన్నెల కిషోర్, అనసూయ, మురళి శర్మ వంటి వారు నటించారు.

 Khiladi Review And Rating , Khiladi Movie , Ravi Teja , Tollywood ,review , Dire-TeluguStop.com

ఈ చిత్రాన్ని సత్యనారాయణ కోనేరు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా నేడు (ఫిబ్రవరి 11) న విడుదలయింది.మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంది? సినిమా కథ ఎలా ఉంది? అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

కథ:

రవితేజ నటించిన ఖిలాడీ సినిమా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉందనీ చెప్పవచ్చు.ఈ సినిమాలో రవితేజ(మోహన్ గాంధీ) అనే ఒక గ్యాంబ్లర్ పాత్రలో మనకు కనిపిస్తారు.

అలాగే పోలీస్ ఆఫీసర్ పాత్రలో సీనియర్ నటుడు అర్జున్ సందడి చేశారు.అసలు కథ విషయానికి వస్తే ఈ సినిమాలో మోహన్ గాంధీ (రవితేజ) ఒక పెద్ద మనీ ఉన్న కంటైనర్ ను దొంగతనం చేస్తాడు.

పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఉన్న అర్జున్ అలాగే ఈ సినిమాలో కూడా ఆ కంటైనర్ ను రవితేజ ఎక్కడ దాచాడు అనే కథపై ఈ సినిమా మొత్తం నడుస్తుంది.అయితే రవితేజ అదే కంటైనర్ లో ఉంటూ పోలీసులకు విలన్లకు సవాళ్ళు విసురుతూ వారిని ముప్ప తిప్పలు పెడుతుంటారు.అయితే పోలీసులు రవితేజ ఎత్తుగడలను కనిపెట్టారా? చివరికి ఆ కంటైనర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారా? చివరికి కథ ఎటు వైపు వెళ్ళిందనేది తెలియాలంటే సినిమా చూడాలి.

నటీనటుల నటన:

ఇందులో హీరోగా నటించిన రవితేజ విషయానికి వస్తే ఈయన నటనకు మంచి గుర్తింపు వచ్చినప్పటికీ కథ మాత్రం రొటీన్ గా ఉందనేది తెలుస్తుంది.ఇక డింపుల్ హయాతి నటన అద్భుతం.మీనాక్షి చౌదరి డాన్స్ ఫర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉందని చెప్పవచ్చు.

టెక్నికల్:

రమేష్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రవితేజ కరోనా తర్వాత రెండో సినిమా అని చెప్పవచ్చు.ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం హైలైట్ అయింది.అలాగే అమర్ రెడ్డి కుడుముల ఎడిటింగ్ అద్భుతంగా ఉంది.సుజిత్ వాసుదేవ్ సినిమాటోగ్రఫీ చాలా అద్భుతంగా చూపించారు.

విశ్లేషణ:

రవితేజ నటించిన ఖిలాడీ సినిమా రొటీన్ కథ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అయితే ఈ సినిమాకు పెద్దగా పోటీ లేక పోవడంతో ఈ సినిమా పరవాలేదు అనిపించుకుంది.

ఇక కొన్ని సన్నివేశాలు ఎంతో సాగదీయడంతో ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితులు ఎదురవుతాయి.మొత్తానికి ఈ సినిమా ఒకసారి చూసి రావచ్చు.

ప్లస్ పాయింట్స్:

రవితేజ,  డింపుల్ హయాతి పర్ఫామెన్స్ బాగున్నాయి.అనసూయ క్యారెక్టర్ కూడా అందరినీ ఆకట్టుకుంది.దేవి శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్.

మైనస్ పాయింట్స్:

కథ సాగదీయడం, చాలా సన్నివేశాలకు లైటింగ్ లోపించడం.పోస్ట్ ప్రొడక్షన్ లోపం స్పష్టంగా కనబడుతుంది.సెకండ్ హాఫ్ లో భారీ యాక్షన్ సన్నివేశం.

రేటింగ్:2.25/5

Khiladi Review And Rating , Khiladi Movie , Ravi Teja , Tollywood ,review , Director Ramesh Verma , Meenakshi Chaudhary , Dimple Hayati , Satyanarayana Koneru , Mass Action Entertainer - Telugu Dimple Hayati, Ramesh Verma, Khiladi, Mass, Ravi Teja, Review, Tollywood

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube