ఖిలాడి రవితేజ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలుసా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజ్ ఉన్న హీరోలలో రవితేజ ఒకరని చెప్పవచ్చు.అయితే గత కొన్ని సంవత్సరాల పాటు ఎటువంటి హిట్ సినిమాలు లేకపోవడంతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించాలని కసితో క్రాక్ సినిమా ద్వారా ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

 Ravi Teja Chilling Moment Photo Viral In Social Media, Ravi Teja , Khiladi Movie-TeluguStop.com

అయితే ఈ సినిమాలో ఒక పోలీస్ ఆఫీసర్ గా ఎంతో అద్భుతంగా నటించిన రవితేజ ప్రేక్షకులను బాగా సందడి చేశారు.సంక్రాంతి కానుకగా థియేటర్ లో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల మంచి ఆదరణ లభించడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.

క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సంపాదించుకున్న రవితేజ అదే జోష్ తో ” కిలాడి” అనే సినిమాలో నటిస్తున్నారు.ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు మంచి కిక్ ఇవ్వడానికి రవితేజ తెగ ప్రయత్నం చేస్తున్నాడు.

ఇప్పటికే షూటింగ్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్న ఈ మాస్ మహారాజా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ నిమిత్తం ఇటలీలో చక్కర్లు కొడుతున్నారు.రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పలు పాటలను చిత్రీకరించడం కోసం యూరోపియన్ కంట్రీ , ఇటలీలోని పలు అందమైన లొకేషన్లలో కొన్ని పాటలు చిత్రీకరించనున్నారు.

తాజాగా రవితేజ ఇటలీలోని షూటింగ్ లొకేషన్ చిల్డ్ అవుట్ మూడ్ లో ఉన్న రవితేజ ఫోటో ఒకటి ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ, ఆ ఫోటో కి చిల్లింగ్ అంటూ క్యాప్షన్ జత చేశాడు.ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఎంతోమంది మాస్ మహారాజా అభిమానులను ఆకట్టుకుంది.ఇక పోతే ఎంతో తొందరగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా లో రవితేజతో పాటు డింపుల్ హ‌య‌తి, మీనాక్షిచౌద‌రి ఫీమేల్ లీడ్ రోల్స్ చేస్తున్నారు.శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా 2021 మే 28 న విడుదల చేయడానికి చిత్ర బృందం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

కోనేరు సత్యనారాయణ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube