ఖిలాడి' రమేష్ వర్మ రిలీజ్ చేసిన "మౌనం" థియేట్రికల్ ట్రైలర్!!

లాస్ ఏంజెల్స్ టాకీస్ పతాకంపై కిషన్ సాగర్ దర్శకత్వంలో అల్లూరి సూర్యప్రసాద్-సంధ్య రవి సంయుక్తంగా నిర్మించిన ఆహ్లాదభరిత ప్రేమకథాచిత్రం మౌనం పారా సైకాలజీ నేపథ్యంలో మల్లెపువ్వుఫేమ్ మురళి- బిగ్ బాస్ ఫేమ్ భానుశ్రీ జంటగా నటించిన ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ను ప్రముఖ దర్శకుడు రమేష్ వర్మ ఆవిష్కరించారు.మణిరత్నం మౌనరాగం తరహాలో.

 Khiladi 'ramesh Verma's silence Theatrical Trailer , Tollywood , Mounam , Theat-TeluguStop.com

తన మిత్రుడు మురళి నటించిన మౌనం” మంచి విజయం సాధించాలని రమేష్ వర్మ ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

అక్టోబర్ ప్రథమార్థంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

నిర్మాతలు అల్లూరి సూర్యప్రసాద్-సంధ్య రవి మాట్లాడుతూ మౌనం కూడా కొన్ని సందర్భాల్లో ఎంత శక్తివంతంగా ఉంటుందో చాలా సెన్సిబిల్ గా చూపించే పారా సైకలాజికల్ థ్రిల్లర్ మౌనం .అక్టోబర్ మొదటి వారంలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం.మౌన థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేసిన రమేష్ వర్మగారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు.

ఐశ్వర్య అడ్డాల, శివ ఫేమ్ చిన్నా, జీవా, ధనరాజ్, శేషు ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి.

పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, కథ: అనిల్, స్క్రీన్ ప్లే-ఎడిటింగ్: శివ శర్వాణి, సంగీతం: ఎమ్.ఎమ్.శ్రీలేఖ, నిర్మాతలు: అల్లూరి సూర్యప్రసాద్-సంధ్య రవి, ఛాయాగ్రహణం-దర్శకత్వం: కిషన్ సాగర్!!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube