వినాయకచవితి నుండి మ్యూజిక్ ఫెస్ట్ స్టార్ట్ చేస్తున్న ఖిలాడీ!

మాస్ మహారాజా రవితేజ చేస్తున్న కొత్త చిత్రాల్లో ఖిలాడీ ఒకటి.రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడీ సినిమా తెరకెక్కుతుంది.

 Khiladi Music Festival Starts From Vinayaka Chavithi, Music Festival,vinayaka Ch-TeluguStop.com

క్రాక్ సినిమా సూపర్ హిట్ అయినా తర్వాత వస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు.ఈ సినిమాను రమేష్ వర్మ హై వోల్టేజ్ యాక్షన్ సినిమాగా తెరకెక్కిస్తున్నాడు.

ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్, టీజర్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

ఖిలాడీ సినిమా షూటింగ్ మొన్నటి వరకు ఇటలీలో శరవేగంగా జరిగి ఆ షెడ్యూల్ పూర్తి చేసుకుంది.

సెకండ్ వేవ్ తర్వాత ఈ సినిమా మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేసింది.ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది.ఇక ఈ సినిమా నుండి మరొక అప్డేట్ ఇచ్చారు మేకర్స్.సెప్టెంబర్ 10న వినాయకచవితి సందర్భంగా ఈ సినిమా నుండి మ్యూజిక్ ఫెస్ట్ స్టార్ట్ చేయబోతున్నట్టు తెలిపారు.

Telugu Dimple Hatiya, Khiladi, Khiladimusic, Music Festival, Ramesh Varma, Ravi

ఈ క్రమంలోనే ఒక పోస్టర్ కూడా విడుదల చేసింది.ఈ పోస్టర్ లో రవితేజ హీరోయిన్ తో కలిసి స్టెప్పులేస్తున్నట్టు కనిపిస్తుంది.ఈ సినిమా నుండి ఇష్టం అనే ఫస్ట్ సింగిల్ విడుదల చేయబోతున్నట్టు ఆ పోస్టర్ ద్వారా తెలిపారు.ఈ సాంగ్ హీరో హీరోయిన్ మధ్య సాగే రొమాంటిక్ సాంగ్ ఇది.ఇప్పటికే ఈ సాంగ్ ప్రోమో కూడా విడుదల చేయగా మంచి స్పందన తెచ్చుకుంది.

Telugu Dimple Hatiya, Khiladi, Khiladimusic, Music Festival, Ramesh Varma, Ravi

ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.ఇక వినాయక చవితి నుండి ఖిలాడీ మ్యూజిక్ ఫెస్ట్ స్టార్ట్ అవ్వబోతుంది.ఈ సినిమాను పెన్ స్టూడియోస్ సమర్పణలో హవీష్ ప్రొడక్షన్ బ్యానర్ పై సత్యనారాయణ కోనేరు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.రవితేజకు జోడీగా మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు.త్వరలోనే రిలీజ్ డేట్ కూడా ప్రకటించ బోతున్నారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube