ఖిలాడీ వీడియో వైరల్.. రవితేజ ఛేజింగ్ మాములుగా లేదుగా !

టాలీవుడ్ మాస్ మహారాజగా పేరు తెచ్చుకుని ఏడాదికి నాలుగు సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తాడు రవితేజ.ఈ సంవత్సరం కూడా క్రాక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

 Khiladi Action Video Viral In Social Media-TeluguStop.com

చాలా రోజులుగా హిట్ లేక సతమతమవుతున్న రవితేజకు క్రాక్ సూపర్ హిట్ అవ్వడంతో ఫుల్ ఖుషీగా ఉన్నాడు.ఈ సినిమా తర్వాత రవితేజ వరస పెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.

ప్రస్తుతం రవితేజ రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడీ సినిమా చేస్తున్నాడు.

 Khiladi Action Video Viral In Social Media-ఖిలాడీ వీడియో వైరల్.. రవితేజ ఛేజింగ్ మాములుగా లేదుగా -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పెన్ స్టూడియోస్ సమర్పణలో ఈ సినిమాను హవీష్ ప్రొడక్షన్ బ్యానర్ పై సత్యనారాయణ కోనేరు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.రవితేజకు జోడీగా మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదల అయిన ఫస్ట్ లుక్, ఫస్ట్ గ్లిమ్స్, టీజర్ నుండి మంచి స్పందన వచ్చింది.

ఈ సినిమాలో అర్జున్ విలన్ గా నటిస్తున్నాడు.అంతేకాదు అనసూయ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తుంది.రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

ఈ సినిమా భారీ యాక్షన్ సన్నివేశాలతో సాగుతుందని దర్శకుడు ముందు నుండి చెబుతున్నాడు.రవితేజ తన కెరీర్ లో ఇప్పటి వరకు ఇంత యాక్షన్ సన్నివేశాలు ఉన్న సినిమాలో నటించలేదు.

తాజాగా ఈ విషయం నిజమేనని ఇప్పుడు బయటకు వచ్చిన వీడియో చూస్తే తెలుస్తుంది.మొన్నటి వరకు ఇటలీలో షూటింగ్ జరుగగా అక్కడ మేకర్స్ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించారు.ఇప్పుడు ఆ యాక్షన్ సన్నివేశాల్లో ఒక బైక్ చేజింగ్ క్లిప్ బయటకు రావడంతో ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతుంది.హాలీవుడ్ రేంజ్ లో ఉన్న ఆ యాక్షన్ సన్నివేశం చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

చూడాలి మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంత మేరకు మెప్పిస్తుందో.

#Ramesh Varma #Ravi Teja #Action Video #KhiladiAction #Social Media

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు