పాస్ పోర్ట్ ఇవ్వలేదని దుబాయ్ లో ఆత్మహత్య చేసుకున్న జగిత్యాల వాసి  

Kharagpur Man Committed Suicide In Dubai-kharagpur Person,suicide In Dubai

డబ్బు సంపాదించాలి అన్న ఉద్దేశ్యం తో ఇతర దేశాలకు వెళ్లి నానా అవస్థలు పడుతున్నారు అమాయకపు జనం. ఉద్యోగాల పేరిటసరైన కన్సుల్టేన్సీ లను సంప్రదించకుండా ఇతర దేశాలకు వెళుతున్న వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారుతున్నాయి. ఈ దశలో కొందరు ధైర్యంగా పోరాడి ఎలాగో బయటపడగలుగుతున్నారు కానీ, మరికొందరు మాత్రం ప్రాణాలను తీసుకొనే పరిస్థితులు ఏర్పడుతున్నాయి..

పాస్ పోర్ట్ ఇవ్వలేదని దుబాయ్ లో ఆత్మహత్య చేసుకున్న జగిత్యాల వాసి -Kharagpur Man Committed Suicide In Dubai

ఇలాంటి ఘటనే దుబాయ్ లో చోటుచేసుకుంది. బతుకు తెరువు కోసం జగిత్యాల జిల్లా రాయి కాల్ మండలం కట్కాపూర్ కు చెందిన అయితే భూమయ్య(43) అనే వ్యక్తి దుబాయ్ లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది.

వివరాల్లోకి వెళితే… కట్కాపూర్ కు చెందిన భూమయ్యే పదిహేనేళ్ళు గా దుబాయ్ లో ఎరిటి గా ఒక కంపెనీ లో పనిచేస్తున్నాడు. అయితే గత కొంత కాలంగా ఆ కంపెనీయే వేతనం చెల్లించకపోవడం తో అసహనం చెందిన అతడు స్వగ్రామానికి వెళ్తానని పాస్ పోర్ట్ ఇవ్వాలని కోరాడు. అయితే పాస్ పోర్ట్ కోసం పలుమార్లు కంపెనీ యాజమాన్యాన్ని వేడుకున్నా స్పందించకపోవడం తో తీవ్ర మనస్థాపానికి గురైన భూమయ్య ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది.

ఈ భూమయ్య కుటుంబీకులు తెలిపారు. మృతుడికి భార్య,కొడుకు,కుమార్తె ఉన్నారు. అయితే ఈ నెల 10 న భూమయ్య ఆత్మహత్య చేసుకున్నాడని వెంటనే ప్రభుత్వం స్పందించి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. బ్రతుకు తెరువు కోసం దుబాయ్ వెళ్లిన భూమయ్య అక్కడే విగత జీవిగా మారడాన్ని గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు.