ఖమ్మం టూ గుడివాడ ! రేణుకమ్మ లెక్కలు వేరేలే ? 

ఫైర్ బ్రాండ్ నాయకురాలిగా గుర్తింపు పొందిన మాజీ కేంద్రమంత్రి, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కీలక నేత రేణుక చౌదరి తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు.రాజకీయంగా మంచి వాక్చాతుర్యం కలిగిన రేణుక చౌదరి రాబోయే తెలంగాణ ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

 Khammam To Gudivada! Are Renukamma's Calculations Different, Congress Ex Mp, Ren-TeluguStop.com

పూర్తిగా తెలంగాణ రాజకీయాలకే పరిమితమైన రేణుక చౌదరి అనూహ్యంగా గత కొంతకాలంగా ఏపీ రాజకీయాల పైన స్పందిస్తున్నారు.ముఖ్యంగా అమరావతి వ్యవహారంలో చురుగ్గా ఉంటున్నారు.

ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేయడంతో పాటు,  అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన ఉద్యమంలోనూ పాల్గొని వైసిపి ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.దీంతో పాటు ,  వైసిపి కీలక నేత మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని పైన రేణుక చౌదరి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు .

Telugu Amaravati, Congress Mp, Jagan, Khamma, Khammamassembly, Renuka Chowdary-P

తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన రేణుక చౌదరి అమరావతి వ్యవహారంపై స్పందించడం అప్పట్లో రాజకీయంగా చర్చనీయాంశం అయ్యింది.ఇక ఇప్పుడు మరోసారి ఆమె  రాజకీయంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.తాను తెలంగాణతో పాటు,  ఆంధ్రప్రదేశ్ లోనూ పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు.అది కూడా గుడివాడ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నట్టు రేణుక చౌదరి తెలిపారు.మొన్నటి వరకు ఉమ్మడి రాష్ట్రమే కదా ఏపీలో పోటీ చేస్తే తప్పేంటి అంటూ ఆమె సమర్ధించుకుంటున్నారు.అలాగే తనను ఏపీలో పోటీ చేయాల్సిందిగా ఒత్తిడి పెరుగుతోందని,  అందుకే గుడివాడని తాను ఎంచుకున్నట్లు రేణుక చౌదరి చెబుతున్నారు.

ఖమ్మం అసెంబ్లీ స్థానంతో పాటు , గుడివాడ నుంచి పోటీ చేయాలని తన మనసులో ఉందని,  రెండు చోట్ల పోటీ చేయడంపైనే సీరియస్ గా ఆలోచిస్తున్నానంటూ రేణుక చౌదరి చెప్పడం వంటివి రాజకీయంగా సంచలనం రేపుతున్నాయి.

Telugu Amaravati, Congress Mp, Jagan, Khamma, Khammamassembly, Renuka Chowdary-P

ఇప్పటికి కూడా నియోజకవర్గంలో బలంగా ఉన్న కొడాలి నానిని ఢీకొట్టేందుకు తెలుగుదేశం ఎన్నారై రాము ని రంగంలోకి దించింది.ఆయనని టిడిపి అభ్యర్థిగా పోటీ చేయించి నానిని ఢీ కొట్టాలని ప్లాన్ చేస్తోంది.ఇక ఇప్పుడు రేణుక చౌదరి కూడా ఇదే నియోజకవర్గం పై ఫోకస్ పెట్టడంతో ఆమె కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీకి దిగుతారా లేక స్వతంత్ర అభ్యర్థిగా పోటీ  చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.

ఇక ఆమె గుడివాడ నే ఎంచుకోవడం వెనుక పెద్ద ప్లానే ఉన్నట్టుగా అర్థం అవుతోంది.ఈ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం ప్రభావం ఎక్కువగా ఉండడం, మహిళా సెంటిమెంట్ ఇవన్నీ కలిసి వస్తాయనే ఆలోచనతోనే గుడివాడ ప రేణుక చౌదరి దృష్టి సారించినట్లు అర్థమవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube